Saturday, October 10, 2020

సంస్కార సమేత రెడ్డి నాయుడు (3) మూడవ భాగం

 సంస్కార సమేత రెడ్డి నాయుడు (3)

మూడవ భాగం

______________________________ 

అది బాహుదా ఏటి గట్టున విశాలమైన ఇసుక తిన్నెలు ఉన్నాయి. నీరు గూడా వేసవి కాలం వలన అంతగా ప్రవహించడం లేదు. ఆ ఇసుక తిన్నెల్ని అద్భుతంగా తీర్చి దిద్దారు. ఏటి గట్టుకి ఆనుకొని ఉన్న మైదానంలో విశాల మైన వెదురు తాటాకు పందిళ్ళతో  అలంకరించారు. రెండు సింహాసనల్లాంటి కుర్చీలను తెప్పించారు.‌

మరియు పెద్ద పెద్ద జంఖానాల్ని , ఈత చాపల్ని క్రింద పరిచారు. ఆ ఆట పాటల్ని చూడడానికి రెండు గ్రామ ప్రజలు బాగా వచ్చారు.‌పెట్రోమాక్సు లైట్లు రాయ చోటి నుండి ఒక్క డజన్ దాకా తెప్పించారు. అక్కడికి ఇంకా కరెంటు రాలేదు అప్పటికి. పీలేరు నుండి రకరకాల వంట దినుసులు, వంట సామాన్లు  తెప్పించారు. 

ఆ రోజు ఇద్దరి గ్రామ పెద్దల జన్మ దినం ఒక్కే రోజు కావడం వల్ల పల్లె జనాలకి అంత సంబ్రమం..ఆనందం ..

ఆ వేడుకల్ని చూడడానికి ప్రక్క గ్రామాల నుండి గూడా వచ్చారు.

ఏటి ఒడ్డున మైదానంలో పెట్రోమాక్స్  లైట్ల వెలుగులో ఆకాశం నుండి పెద్ద నక్షత్రాలు  దిగి వచ్చాయా అనిపిస్తోంది.

సంవత్సరానికి ఒక్క సారి వచ్చే ఈ  జాతర లాంటి ఉత్సవాన్ని ఎవ్వరూ వదులు కోరు.

మల్లయుద్దం, కబడి, కోలాటాలు, పగటి వేషగాళ్ళు తో ఆ ప్రదేశ మంతా నిండి పోయింది.

కొందరు గ్రామ నృత్యాలు చేస్తున్నారు. వీధి నాటకాలు వేసే వాళ్ళు , దొమ్మరి వాళ్ళూ , బుర్ర కథలు చెప్పేవాళ్ళ కళా ప్రదర్శనలతో ఆ గ్రామ పెద్దల్ని సంతోష పరుస్తారు.

తమ తమ కళా నైపుణ్యంతో ప్రతిభ కన బరచిన వారిని నాయుడు గారు, రెడ్డి గారు తృణమో పణమో ఇచ్చి, బహుమానాలతో సత్కరించి సంతృప్త పరుస్తారు.

ఒక్క దశలో గ్రామ ప్రజల వేడుక కోసం రెడ్డి గారిని, నాయుడు గారిని మల్లయుద్ధం  చెయ్యమని ప్రేరేపించారు.

ఇద్దరూ ఇద్దరే...పరాక్రమ  సింహలే! కండలు పెంచి శరీర ధారుడ్యంతో చక్కగా ఉంటారు. ఇద్దరూ అభినవ భీమ పరాక్రమ వంతులే! వారికి కేటాయించిన ఇసుక ప్రాగణంలో ఇద్దరూ ధోవతల్ని ఎగ గట్టి  మల్ల యుద్ధానికి ఇద్దరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అందులో ఎవ్వరూ ఓడడానికి గానీ, గెలవడానికి కానీ వీలు లేదు. ఇద్దరూ చివరి దాకా పోరాడారు. అలనాడు భీముడు మహా భారతంలో భీముడు  సుయోధనునితో పోరాడినట్లు అక్కడి ప్రజలు తల పోస్తారు. వారి కేరింతలతో..చప్పట్లతో ఆ ప్రదేశమంతా  మారు మ్రోగిపోతోంది. ఎంతో సేపయినా ఇద్దరిలో ఎవ్వరూ ఓడి పోవడం లేదు. ఎవ్వరి నైపుణ్యత వారి కున్నది. ఇద్దరూ అలసి పోవడం చూసి , అక్కడున్న అనుచరులు ఇద్దరిని విడదీసి భుజాల మీదెత్తుకొని తిప్పారు. కొందరు ఆడవారు కర్పూర నీరాజనాలు ఇచ్చి , దిష్టి తీసారు. కొందరు లేత కొబ్బరి బోండాలను త్రాపించారు.

సన్నాయి మేళ తాళాలతో..డోలు వాయిద్యాలతో, అక్కడ ఆ సందడి కోలాహలంగా‌ ముగిసింది.

అందరికీ విందు భోజనాలు ముగిసాక అర్ధ రాత్రి దాటింది. 

ఎవ్వరి ఇళ్ళకు వారు వెళ్ళి పొయ్యారు.

***************************************************

ఒక వారం రోజుల తరువాత ...

ఆ రోజు రాత్రి తోలు  పలకలు కొట్టుకొంటూ దండోరా వేయించారు రెండు గ్రామాల్లోనూ.

" అందరూ వినండహో! సోమ వారం కాడ్నుంచీ  కాలవ తీత పనులు మొదలు పెడతా ఉండారు. రైతు లందరూ కాలువ పూడిక పనులకు హాజరు కావాల్సిందహో...." అని   మళ్ళీ పలకతో దరువు  కొట్టుకొంటూ వెళ్ళి పొయ్యాడు.‌ 

పిల్లలు  అందరూ ఆ దండోరా వేసిన వ్యక్తి వెనకాల నడుస్తూ ఈలలు వేసుకొంటూ ఎగురు కొంటూ పోతున్నారు. పెద్దలు తమ సందేహాల్ని అడుగుతూ సమాచారాన్ని తెలుసు కొంటున్నారు. 

ఈ రెండు పల్లెలకు సర్పంచి ఒక్కడే..ఆయనే హనుమంత రెడ్డి.

ఆయన చెప్పిన ప్రకారం దండోరా వేస్తున్నాడు బంట్రోతు.

వేసవి కాలంలో కాలువ పూడిక పనులు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు. బాహుదా నదిలో నీరు తాత ముత్తాతల కాలంలో ఉన్నట్లు లేదు. కొన్ని నెలలు ఎండి పోతుంది. మళ్ళీ వర్షాకాలం మొదలై పోతే నీరు పుష్కలంగా ప్రవ హిస్తుంది.

 చిత్తూరు జిల్లాలో బాహుదా నది చాలా పెద్దది.  పూర్వం రెండు చేతులూ లేని ఒక పేద వాడు రోజూ తనకు చేతుల్లేవని ఏట్లో కూర్చొని  ఎక్కి ఎక్కి ఏడ్చే వాడంట. ఒక్క రోజు ఉన్నట్లుండి నదిలో నీరు జోరుగా వస్తోందంట. ఈ పేద వాడు సంతోషంతో ఎగురుతూ " అమ్మా .‌గంగమ్మ తల్లీ..నాకు చేతులు ఇయ్యమ్మా! " అని మూడు మునకలు వేసి మునిగాడంట ఆ నదిలో..అంతే ..అనుకోకుండా అతని రెండు చేతులూ అంటే బాహువులు వచ్చాయంట. అప్పటి నుండీ ఆ నదికి బాహుదా నది అని పేరొఛ్చింది అని ఒక కథ చెబుతారు ఈ జిల్లా వాళ్ళు.

ఎక్కడో నిమ్మనపల్లి కాడ్నుంచి  వచ్చి చిత్తూరు , కడప జిల్లాల్ని తాకి , నెల్లూరు జిల్లా లోని బంగాళా ఖాతం లో కలుస్తుంది. 

ఒకప్పుడు ఈ నది పొంగి పొర్లేదంట...ఇప్పుడు రాయల సీమ లో వర్షా భావం వలన ఈ నది గూడా ఎండి పోతోంది. ఇకపై మూడు పంటలు కాదు గదా..ఒక్క పంట గూడా వెయ్య లేని పరిస్థితి వస్తుందేమో నని రైతులు బాధ పడుతూ ఉంటారు.

సోమ వారం రానే వచ్చింది. 

తెల్ల వారి నాలుగు గంటలకే లేచి యువకులు , పెద్దలు అందరూ బయలు దేరారు. చేతుల్లో పలుగు పారా, ఇనుప జల్లెళ్ళు పట్టుకొని , పంచలు ఎగ్గొట్టుకొని, తల మీద రుమాలు గట్టిగా చుట్టుకొని ఒక యాభై మంది రైతులు రెండు గ్రామాల నుండి కాలువ మొదలు చేరారు.

అక్కడికి అందరూ చేరుకోగానే ఆ రైతులు అక్కడున్న వారిద్దరినీ చూసి  ఆశ్చ్యర్య పొయ్యారు. 

"అన్నా ..మీ రెందుకు వచ్చి నారన్నా..మేము సూసు కొంటాము గదా? " అన్నారు కొందరు.

" మీకు యాలప్పా ఈ కట్టం ? మేముండాము గదా? " అన్నాడు ఈశ్వరప్ప.

అక్కడ రైతు కూలీల వేషంలో చేతుల్లో  పలుగు పారా, ఇనుప జల్లెళ్ళు పట్టుకొని రాజ శేఖర రెడ్డి మరియు జయ రామ నాయిడు కాలువ పూడిక పనులు చేస్తున్నారు.. వారిద్దరూ అందరి కంటే ముందే వచ్చి పనులు ప్రారంభించారు. అదీ నాయకత్వ లక్షణం. ఆ పది  గ్రామాల్లో వారికి అంత మంచి పేరు ఉంది. రామ లక్ష్మణుల్లా ఉండారయ్యా అని కొండంత అభిమానాన్ని చూపిస్తారు ఆ గ్రామ ప్రజలు.‌

" నిన్న గదా అప్పా...బహ్మాండంగా పుట్టిన రోజు పండగ సేసుకొన్నారు. మీరు ఎల్లి పోండి అయ్యా..మేము సూసు కొంటాము " అన్నారు వాళ్ళల్లో ఒకాయన 

" ఏమీ ..మేము పని చెయ్య గూడదా గోవింద రెడ్డీ.. మీకు లాగే మా  భూములూ ఉన్నాయి ఏటి నీళ్ళతో పండే దానికి. మా జీత గాళ్ళతో పాటు మేమూ వచ్చాము. ఎయ్యండి ..తలా ఒక్క చెయ్యి..ఎండ ఎల్ల బారక ముందే పని ముగించ వచ్చు" అన్నాడు రాజ శేఖర రెడ్డి.

ఒరేయ్ ..నాగన్నా..ఆ జల్లేడ ఇవ్వు..ఈ బురద మట్టి అంతా గట్టు మీద వేస్తా.." అన్నాడు జయ రామ నాయుడు.

రైతుకు శ్రమ శక్తే సంపద. శ్రమ పడి తేనే రైతుకు ఆనందం.ఆరోగ్యం. రైతు కుటుంబంలో పుట్టి ఈ మాత్రం పని చెయ్యక పోతే ఎందుకురా? పదండి ముందుకు...కాలువ తవ్వండి  బిరీన..." అన్నాడు రెడ్డి గారు.

అందరూ హుషారుగా కాలువ పనులో నిమగ్న మయ్యారు.సంస్కార సమేత రెడ్డి నాయుడు (4)(5)

సంస్కార సమేత రెడ్డి నాయుడు (3)

మూడవ భాగం

______________________________

అది బాహుదా ఏటి గట్టున విశాలమైన ఇసుక తిన్నెలు ఉన్నాయి. నీరు గూడా వేసవి కాలం వలన అంతగా ప్రవహించడం లేదు. ఆ ఇసుక తిన్నెల్ని అద్భుతంగా తీర్చి దిద్దారు. ఇసుక తిన్నెల మీద రంగు రంగుల జెండాలని పాతి పెట్టారు. అవి గాలికి రెప రెప లాడుతూ వింత శబ్ధంతో  ఎగురు తున్నాయి. ఏటి గట్టుకి ఆనుకొని ఉన్న మైదానంలో విశాల మైన వెదురు తాటాకు పందిళ్ళతో  అలంకరించారు. రెండు సింహాసనల్లాంటి కుర్చీలను తెప్పించారు.‌

మరియు పెద్ద పెద్ద జంఖానాల్ని , ఈత చాపల్ని క్రింద పరిచారు. ఆ ఆట పాటల్ని చూడడానికి రెండు గ్రామ ప్రజలు బాగా వచ్చారు.‌పెట్రోమాక్సు లైట్లు  రాయ చోటి నుండి ఒక్క డజన్ దాకా తెప్పించారు. అక్కడికి ఇంకా కరెంటు రాలేదు అప్పటికి. పీలేరు నుండి రకరకాల వంట దినుసులు, వంట సామాన్లు  తెప్పించారు.

ఆ రోజు ఇద్దరి గ్రామ పెద్దల జన్మ దినం ఒక్కే రోజు కావడం వల్ల పల్లె జనాలకి అంత సంబ్రమం..ఆనందం ..

ఆ వేడుకల్ని చూడడానికి ప్రక్క గ్రామాల నుండి గూడా వచ్చారు.

ఏటి ఒడ్డున మైదానంలో పెట్రోమాక్స్  లైట్ల వెలుగులో ఆకాశం నుండి పెద్ద నక్షత్రాలు  దిగి వచ్చాయా అనిపిస్తోంది.

సంవత్సరానికి ఒక్క సారి వచ్చే ఈ  జాతర లాంటి ఉత్సవాన్ని ఎవ్వరూ వదులు కోరు.

మల్లయుద్దం, కబడి, కోలాటాలు, పగటి వేషగాళ్ళు తో ఆ ప్రదేశ మంతా నిండి పోయింది.

కొందరు గ్రామ నృత్యాలు చేస్తున్నారు. వీధి నాటకాలు వేసే వాళ్ళు , దొమ్మరి వాళ్ళూ , బుర్ర కథలు చెప్పేవాళ్ళ కళా ప్రదర్శనలతో ఆ గ్రామ పెద్దల్ని సంతోష పరుస్తారు.

తమ తమ కళా నైపుణ్యంతో ప్రతిభ కన బరచిన వారిని నాయుడు గారు, రెడ్డి గారు తృణమో పణమో ఇచ్చి, బహుమానాలతో సత్కరించి సంతృప్త పరుస్తారు.

ఒక్క దశలో గ్రామ ప్రజల వేడుక కోసం రెడ్డి గారిని, నాయుడు గారిని మల్లయుద్ధం  చెయ్యమని ప్రేరేపించారు.

ఇద్దరూ ఇద్దరే....పరాక్రమ   సింహలే! కండలు పెంచి శరీర ధారుడ్యంతో చక్కగా ఉంటారు. ఇద్దరూ అభినవ భీమ పరాక్రమ వంతులే! వారికి కేటాయించిన ఇసుక ప్రాగణంలో ఇద్దరూ ధోవతల్ని ఎగ గట్టి  మల్ల యుద్ధానికి ఇద్దరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అందులో ఎవ్వరూ ఓడడానికి గానీ, గెలవడానికి కానీ వీలు లేదు. ఇద్దరూ చివరి దాకా పోరాడారు. అలనాడు  మహా భారతంలో భీముడు  సుయోధనునితో పోరాడినట్లు అక్కడి ప్రజలు తల పోస్తారు. వారి కేరింతలతో..చప్పట్లతో ఆ ప్రదేశమంతా  మారు మ్రోగిపోతోంది. ఎంతో సేపయినా ఇద్దరిలో ఎవ్వరూ ఓడి పోవడం లేదు. ఎవ్వరి నైపుణ్యత వారి కున్నది. ఇద్దరూ అలసి పోవడం చూసి , అక్కడున్న అనుచరులు ఇద్దరిని విడదీసి భుజాల మీదెత్తుకొని డప్పులు కొట్టుకొంటూ తిప్పారు. కొందరు ఆడవారు కర్పూర నీరాజనాలు ఇచ్చి , దిష్టి తీసారు. కొందరు లేత కొబ్బరి బోండాలను త్రాపించారు.

సన్నాయి మేళ తాళాలతో..డోలు వాయిద్యాలతో, అక్కడ ఆ సందడి కోలాహలంగా‌ ముగిసింది.

అందరికీ ఘనంగా విందు భోజనాలు  వండించారు.. భోజనాలు ముగిసాక అర్ధ రాత్రి దాటింది.

ఎవ్వరి ఇళ్ళకు వారు వెళ్ళి పొయ్యారు.

***************************************************

ఒక వారం రోజుల తరువాత ...

ఆ రోజు రాత్రి తోలు  పలకలు కొట్టుకొంటూ దండోరా వేయించారు రెండు గ్రామాల్లోనూ.

" అందరూ వినండహో! సోమ వారం కాడ్నుంచీ  కాలవ తీత పనులు మొదలు పెడతా ఉండారు. రైతు లందరూ కాలువ పూడిక పనులకు హాజరు కావాల్సిందహో...." అని   మళ్ళీ పలకతో దరువు  కొట్టుకొంటూ వెళ్ళి పొయ్యాడు ఒకాయన.

పిల్లలు  అందరూ ఆ దండోరా వేసిన వ్యక్తి వెనకాల నడుస్తూ ఈలలు వేసుకొంటూ ఎగురు కొంటూ పోతున్నారు. పెద్దలు తమ సందేహాల్ని అడుగుతూ సమాచారాన్ని తెలుసు కొంటున్నారు.

ఈ రెండు పల్లెలకు సర్పంచి ఒక్కడే..ఆయనే హనుమంత రెడ్డి.

ఆయన చెప్పిన ప్రకారం దండోరా వేస్తున్నాడు బంట్రోతు.

వేసవి కాలంలో కాలువ పూడిక పనులు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు. బాహుదా నదిలో నీరు తాత ముత్తాతల కాలంలో ఉన్నట్లు లేదు. అప్పుడు ఏ ఋతువు లో నైనా నీరు బాగా ప్రవహించేదట.. కొన్ని నెలలు ఎండి పోతుంది. మళ్ళీ వర్షాకాలం మొదలై పోతే నీరు పుష్కలంగా ప్రవ హిస్తుంది.

చిత్తూరు జిల్లాలో బాహుదా నది చాలా పెద్దది.  పూర్వం రెండు చేతులూ లేని ఒక పేద వాడు రోజూ తనకు చేతుల్లేవని ఏట్లో కూర్చొని  ఎక్కి ఎక్కి ఏడ్చే వాడంట. ఒక్క రోజు ఉన్నట్లుండి నదిలో నీరు జోరుగా వస్తోందంట. ఈ పేద వాడు సంతోషంతో ఎగురుతూ " అమ్మా .‌గంగమ్మ తల్లీ..నాకు చేతులు ఇయ్యమ్మా! " అని మూడు మునకలు వేసి మునిగాడంట ఆ నదిలో..అంతే ..అనుకోకుండా అతని రెండు చేతులూ అంటే బాహువులు వచ్చాయంట. అప్పటి నుండీ ఆ నదికి బాహుదా నది అని పేరొఛ్చింది అని ఒక కథ చెబుతారు ఈ జిల్లా వాళ్ళు.

ఎక్కడో నిమ్మనపల్లి కాడ్నుంచి  వచ్చి చిత్తూరు , కడప జిల్లాల్ని తాకి , నెల్లూరు జిల్లా లోని బంగాళా ఖాతం లో కలుస్తుంది.

ఒకప్పుడు ఈ నది పొంగి పొర్లేదంట...ఇప్పుడు రాయల సీమ లో వర్షా భావం వలన ఈ నది గూడా ఎండి పోతోంది. ఇకపై మూడు పంటలు కాదు గదా..ఒక్క పంట గూడా వెయ్య లేని పరిస్థితి వస్తుందేమో నని రైతులు బాధ పడుతూ ఉంటారు.

సోమ వారం రానే వచ్చింది.

తెల్ల వారి ఝామున నాలుగు గంటలకే లేచి యువకులు , పెద్దలు అందరూ బయలు దేరారు. చేతుల్లో పలుగు పారా, ఇనుప జల్లెళ్ళు పట్టుకొని , పంచలు ఎగ్గొట్టుకొని, తల మీద రుమాలు గట్టిగా చుట్టుకొని ఒక యాభై మంది రైతులు రెండు గ్రామాల నుండి కాలువ మొదలు చేరారు.

అక్కడికి అందరూ చేరుకోగానే ఆ రైతులు అక్కడున్న వారిద్దరినీ చూసి  ఆశ్చ్యర్య పొయ్యారు.

"అన్నా ..మీ రెందుకు వచ్చి నారన్నా..మేము సూసు కొంటాము గదా? " అన్నారు కొందరు.

" మీకు యాలప్పా ఈ కట్టం ? మేముండాము గదా? " అన్నాడు ఈశ్వరప్ప.

అక్కడ రైతు కూలీల వేషంలో చేతుల్లో  పలుగు పారా, ఇనుప జల్లెళ్ళు పట్టుకొని రాజ శేఖర రెడ్డి మరియు జయ రామ నాయిడు కాలువ పూడిక పనులు చేస్తున్నారు.. వారిద్దరూ అందరి కంటే ముందే వచ్చి పనులు ప్రారంభించారు. అదీ నాయకత్వ లక్షణం. ఆ పది  గ్రామాల్లో వారికి అంత మంచి పేరు ఉంది. రామ లక్ష్మణుల్లా ఉండారయ్యా అని కొండంత అభిమానాన్ని చూపిస్తారు ఆ గ్రామ ప్రజలు.‌

" నిన్ననే గదా అప్పా...బహ్మాండంగా పుట్టిన రోజు పండగ సేసుకొన్నారు. మీకు యాల ఈ కట్టం? మీరు ఎల్లి పోండి అయ్యా..మేము సూసు కొంటాము " అన్నాడు వాళ్ళల్లో ఒకాయన .

" ఏంది గోవింద రెడ్డీ ..బాగా సెప్పినావులే అబ్బా......మేము పని చెయ్య గూడదా?   మీకు లాగే మా  భూములూ ఉన్నాయి ఏటి నీళ్ళతో పండే దానికి. మా జీత గాళ్ళతో పాటు మేమూ వచ్చాము. ఎయ్యండి ..తలా ఒక్క చెయ్యి..ఎండ ఎల్ల బారక ముందే పని ముగించ వచ్చు" అన్నాడు రాజ శేఖర రెడ్డి.

" ఒరేయ్ ..నాగన్నా..ఆ జల్లెడ ఇవ్వు..ఈ బురద మట్టి అంతా గట్టు మీద వేస్తా.." అన్నాడు జయ రామ నాయుడు.

" రైతుకు శ్రమ శక్తే సంపద. శ్రమ పడి తేనే రైతుకు ఆనందం.ఆరోగ్యం. రైతు కుటుంబంలో పుట్టి ఈ మాత్రం పని చెయ్యక పోతే ఎందుకురా? పదండి ముందుకు...కాలువ తవ్వండి  బిరీన..." అన్నాడు రెడ్డి గారు.

అందరూ హుషారుగా కాలువ పనులో నిమగ్న మయ్యారు.

అంతలో నాగన్న ఒక్క  సినిమా పాట ఎత్తు కొన్నాడు.

" ఏరువాక సాగారోయ్  రన్నో సిన్నన్నా

నీ కష్ట మంతా తీరును రోయ్ రన్నో సిన్నన్నా!  "

తరువాత ఏమయ్యిందో రేపు  నాలుగవ భాగంలో చూద్దాం ! )

***********************************************

( ఈ కథ లోని వ్యక్తులు, పేర్లు , సన్ని వేశాలు, సంఘటనలు , ప్రదేశాలు అన్నీ కేవలం కల్పితాలు. కథకు అనుగుణంగా ఈ ప్రదేశాలను , పేర్లను వాడబడడ మైనది. ఏ కుల ,  ఏ వర్గ , ఏ  సామాజిక వర్గాన్ని గానీ ఉద్దేశించి వ్రాయలేదు. కేవలం కల్పితం)

(ఈ కథ ప్రతి భాగం చదివిన తరువాత మీ అభిప్రాయం లేదా సమీక్ష  తెలుపు తారు గదూ? )

రచయిత: వారణాసి భానుమూర్తి రావు

జన్మ స్థలం: మహల్ రాజు పల్లి , చిత్తూరు జిల్లా

ప్రస్థుత నివాసం : హైదరాబాదు.

Copy Rights @ With Author

కాపీ రైట్స్ @రచయితవి. 

To

---------- Forwarded message ---------

From: vbmrao <vbmrao21@gmail.com>

Date: Sat, Jan 23, 2021 at 2:53 PM

Subject: 

To: VBM Rao <vbmrao21@gmail.com>

సంస్కార సమేత రెడ్డి నాయుడు (4)(5)

No comments:

Post a Comment