ఈనిన దుబ్బలు
వారణాసి భానుమూర్తి రావు
03.05.2019
-----------+++++++------------+++++++----------
ఈనిన వరి దుబ్బలు రక్తంతో తడచి పోయి నట్లున్నాయి
మోపులకు కట్టిన గడ్డి కొనలు ఉరిత్రాళ్ళయినట్లున్నాయి
ఎడమ కన్ను కంట్లో సూరీడు కొడవలి పట్టుకొన్నాడు
ఆ అర్థ రాత్రి చంద్రుడు శవమై ఆకాశానికి నల్ల రంగు
పులిమేశాడు
పల్లె ఎప్పటిలాగే వొళ్ళు విరచుకొని నిద్ర లేచింది
షరా మామూలే ...
అక్కడ నవ్వులు పూయడం లేదు
తెగుళ్ళు పట్టి బ్రతుకులు పుచ్చి పోయినాయి.

No comments:
Post a Comment