Wednesday, January 9, 2019

వెలుతురు ప్రవాహం


అంశం: వెలుతురు ప్రవాహం
కవి: వారణాసి భానుమూర్తి రావులపాలెం
సంఖ్య:1
 ------------------------------------------------



నేను కొన్ని వెలుతురు చుక్కలు మింగి
ఒక సూర్యుడై పోతాను
నేను వెలుగు ప్రవాహమై
ఈ చీకటి అజ్నానాన్ని పారద్రోలుతాను
నైరాశ్యపు మేఘాలు అడ్డమొచ్చినా సరే 
నా అక్షరాల కిరణాలను వెద జల్లుతాను
నా ఒక్కొక్క సిరా చుక్క
కొన్ని బీజాక్షరాల సైనికులను తయారు చేస్తుంది
నా అంతరాంతరంగాల్లొంచి ఉబికి వస్తున్న
ఒక్కొక్క అక్షరం
ఒక్కొక్క *వెలుతురు ప్రవాహమై*
నవ సమాజాన్ని ప్రభవిస్తుంది!
సమ సమాజాన్ని ఉదయిస్తుంది!!


వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు


*మాధవీసనారా గారి సమీక్ష
*******************
6)    *వారణాసి భానుమూర్తి రావు*
       
వెలుతురు చుక్కలు మింగి సూర్యుడైపోతానంటాడు కవి.తన ఒక్కొక్క సిరా చుక్కా బీజాక్షరాల సైనికుల్ని తయారు చేస్తుందనడం మంచి అభివ్యక్తి.మంచి భావుకతా ప్రదర్శన కనబరచి మంచి కవితను ఆవిష్కరించారు.
     
  *ముగింపు సమీక్ష*
     **************
45ఏళ్ళ క్రితం హైదరాబాద్ లో జరిగిన రచయితల మహాసభలో ప్రముఖ కవి బోయి భీమన్న "ఓయి కవీ కవిత్వం రాయి"అంటూ ఓ కరపత్రం పంచారు.దాస్యం లక్ష్మయ్య గారు యువ,నవ కవుల్ని ప్రోత్సహించడానికి మంచి కవుల్ని తయారు చెయ్యడానికి నిబద్ధతతో ఈ గ్రూపుని రూపొందించి దాని ఊతంతో ఎంతో ప్రయాసతో కృషి చేస్తున్నారు.పొగడ్తల ప్రవాహంలో కొట్టుకుపోకుండా మంచి కవిత్వంని అధ్యయనంతో చేసి వారు చేస్తున్న యజ్ఞానికి మీరు సైతం ఈ కవిత్వాగ్నికి సమిధల్ని ఆహుతివ్వండి.ఆల్ ది బెస్ట్.

No comments:

Post a Comment