Sunday, September 16, 2018

ప్రేమ ' కులం'


ప్రేమ ' కులం '
--------------------------------------
ఎన్ని కలాలు రాసినా
ఎన్ని గళాలు విప్పినా
కుల రహిత సమాజం ఎడారిలో ఎండ మావేనా?
ప్రేమికుల ' ప్రేమకులం ' గాలిలో పెట్టిన దీపమేనా?
కులాల అంతరాలు ప్రేమికుల పాలిట శాపాలేనా?

' అమృత వర్షిణి  ' ఎదలో  పుట్టిన ప్రేమ
కులాల అడ్డు గోడలు తెంచుకొని
అన్నీ వదులుకొని  తానే అన్నీ అయి
ప్రణయ వర్షాన్ని కురిపించింది  ' ప్రణయ్ ' కోసం
సమాజం మారనీ మారక పోనీ
వెలి వెయ్యనీ ...చెడు  చెయ్యనీ
కులం పట్టింపులు మనకొద్దని
రెండు జీవితాలు పెనవేసుకొని
ఆశల రెక్కలతో విహరించిన ప్రేమపక్షులు ' అమృత ప్రణయ్'

నడిబజార్లో  కరుణ లేని ముష్కరుడు
చేతిలో ప్రేమ బలి అయింది
సమ సమాజం సిగ్గుతో తల వంచింది
ప్రేమకు  అక్కడ సమాధి కట్టింది
పరువుకు,  అభిజాత్యానికి , ధన బలానికి
ప్రేమ పక్షుల జీవితం ముక్కలయింది.



సమ సమాజం , కుల రహిత సమాజం కోసం
ఈ బలిదానం అంకురార్పణ కావాలి
ప్రేమికులకు కుల మత  రహిత సమాజాన్ని  ఇవ్వాలి
వాళ్ళ బ్రతుకుల్లో పున్నమి వెలుగులు పూయించాలి
కలాలు గళాలు విప్పి కవులు గర్జించాలి
భావి తరాల ప్రేమ నదులు ప్రవాహమై ముందుకు ఉరకాలి!

వారణాసి భానుమూర్తి

 16.09.2018



( మిర్యాల గూడలో నిన్న జరిగిన సంఘటన . కులాంతర వివాహం చేసుకొన్న ఒక ప్రేమ జంటకి జరిగిన అన్యాయాన్ని  నిరసిస్తూ రాసిన కవిత)

No comments:

Post a Comment