మట్టి వేదం
-----------------++++--------------
-----------------++++--------------
తొలకరి జల్లులు కురిసిన వేళ
మట్టి సుగంధాన్ని దోసిళ్ళతో ఒడిసి పడుతూ
వ్రాసుకొంటున్న మట్టి కవిత్వం నాది.
మట్టి సుగంధాన్ని దోసిళ్ళతో ఒడిసి పడుతూ
వ్రాసుకొంటున్న మట్టి కవిత్వం నాది.
మడిలో కదం తొక్కుతూ
మట్టిని తొక్కిన పాదం
వరి పంటకు దుక్కి పెడుతూ
బురద పూలు పూచిన పాదం
ఆ మట్టి రైతన్న పాదాలకు
అభివందనం చేస్తూ
వ్రాస్తున్న మట్టి గేయం నాది
మట్టిని తొక్కిన పాదం
వరి పంటకు దుక్కి పెడుతూ
బురద పూలు పూచిన పాదం
ఆ మట్టి రైతన్న పాదాలకు
అభివందనం చేస్తూ
వ్రాస్తున్న మట్టి గేయం నాది
వెండి కడియాలు తొడిగిన కాళ్ళు
ఇంద్ర ధనస్సు లా వంగిన నడుము
నాటు మడిలో పదం పాడుతూ
వరి గాట్లు పెడుతున్న అమ్మలక్కల
పాదాలకు నమస్కరిస్తూ
పాడు కుంటున్న మట్టి పదం నాది
ఇంద్ర ధనస్సు లా వంగిన నడుము
నాటు మడిలో పదం పాడుతూ
వరి గాట్లు పెడుతున్న అమ్మలక్కల
పాదాలకు నమస్కరిస్తూ
పాడు కుంటున్న మట్టి పదం నాది
అడుసు తొక్కిన కుమ్మరి కాళ్ళకు
మట్టి కుండలు పూచిన పారిజాతాలు
మట్టితో బొమ్మల్ని చేస్తున్న
అపర బ్రహ్మన్నలకు అభివాదం చేస్తూ
ఆలపిస్తున్న మట్టి గీతం నాది
మట్టి కుండలు పూచిన పారిజాతాలు
మట్టితో బొమ్మల్ని చేస్తున్న
అపర బ్రహ్మన్నలకు అభివాదం చేస్తూ
ఆలపిస్తున్న మట్టి గీతం నాది
మట్టితో సహ జీవనం చేస్తూ
మట్టి వాసన వేస్తున్న శ్రమ జీవుల
సౌందర్యాన్ని వర్ణిస్తున్న మట్టి పాట నాది
మట్టి వాసన వేస్తున్న శ్రమ జీవుల
సౌందర్యాన్ని వర్ణిస్తున్న మట్టి పాట నాది
శనగ గుత్తుల వేరుకు అంటుకొన్న
ఎర్ర మట్టి సాక్షిగా
చెరకు గడలకు పేరుకొన్న
నల్ల రేగడి మట్టి సాక్షిగా
నా మట్టి కవిత్వానికి
మట్టి రేణువులే బీజాక్షరాలు
ఎర్ర మట్టి సాక్షిగా
చెరకు గడలకు పేరుకొన్న
నల్ల రేగడి మట్టి సాక్షిగా
నా మట్టి కవిత్వానికి
మట్టి రేణువులే బీజాక్షరాలు
మట్టిలో పుట్టి
మట్టిలో పెరిగి
మట్టిలో కలిసి పోవడమే
మట్టికి మనిషికి మధ్య
కాలం గీసిన చిత్రాలు, విచిత్రాలు
మట్టిలో పెరిగి
మట్టిలో కలిసి పోవడమే
మట్టికి మనిషికి మధ్య
కాలం గీసిన చిత్రాలు, విచిత్రాలు
నా మట్టి వేదాన్ని అంకిత మివ్వడానికి
సాదా సీదా మనుషుల కోసం నేను వెతకడం లేదు
మట్టినే విబూధిలా పూసుకొనే మట్టి శివుళ్ళను
వెతుకు తున్నా!
మట్టి కోసం తపస్సు చేసే మట్టి మునుల్ని
వెతుకు తున్నా!
మట్టిని నమ్ముకొని మట్టిలో బంగారాన్ని
పండించే మట్టి రైతన్నల కోసం
వెతుకు తున్నా!
సాదా సీదా మనుషుల కోసం నేను వెతకడం లేదు
మట్టినే విబూధిలా పూసుకొనే మట్టి శివుళ్ళను
వెతుకు తున్నా!
మట్టి కోసం తపస్సు చేసే మట్టి మునుల్ని
వెతుకు తున్నా!
మట్టిని నమ్ముకొని మట్టిలో బంగారాన్ని
పండించే మట్టి రైతన్నల కోసం
వెతుకు తున్నా!
No comments:
Post a Comment