తెలుగు ప్రాభవం
-------------------------------------------------------------------
రచన : వారణాసి భానుమూర్తి రావు

తెలుగు భాష మాట్లాడితే తక్కువేమీ గాదు
అరువు తెచ్చుకొన్న ఆంగ్ల భాష దమ్మిడీకి కొరగాదు
అమ్మ లాంటి తెలుగు భాష అందరికీ జీవ భాష
కమ్మ నైన లాలి పాట తెలుగు వారి జోల పాట
నన్నయ్య తిక్కన ఎర్రాప్రగ్గడల తెలుగు భారతం
కుమ్మరి మొల్ల తెనిగించిన మొల్ల రామాయణం
త్యాగరాజు పాడిన అచ్చ మైన తెలుగు కృతులు
అన్నమయ్య అలరించిన అందమైన పదాలు
అభినవ వ్యాసుడు పోతన పలికించిన భాగవతము
అష్ట కవుల భువన విజయము తెలుగు తల్లి జయము
కృష్ణ రాయల 'ఆముక్త మాల్యద 'అమ్మ మెడలో మణి హారము
తిరుపతి వెంకట కవుల తెలుగు పద్యము అజరామరము
చిలక మర్తి గురుజాడ రాయప్రోలు కందుకూరి
నా తెలుగు తల్లి సిగలో విరిసిన మల్లెలు మకరందాలు
'మా తెలుగు తల్లికి మల్లె పూదండ ' అనిన శంకరంబాడి
పదికోట్ల తెలుగు వారు పాడుతున్న ప్రణవ గీత మది
శ్రీ శ్రీ పలికించిన అభ్యుదయ గీతము 'మహా ప్రస్థానము '
సినారె కలాన ఎగరేసిన 'విశ్వంభర' విజయ కేతనము
పాటల బ్రహ్మ వేటూరి తెలుగు వారి 'శంకరా భరణము '
'సిరివెన్నెల' పూయించిన తెలుగు పాటల నందన వనము
జయము జయము తెలుగు తల్లి జయమమ్మా నీకు
అమ్మ భాష మన తెలుగు భాష మరచి పోకు
తెలుగు జాతి పాడుతున్న తెలుగు పాట వినుము
'దేశ భాష లందు తెలుగు లెస్స ' అని గొంతెత్తి పాడుము .
-----------------------------------------------------------------------------
ఈ పై నా గేయం /కవిత ' తెలుగు ప్రాభవం ' నా స్వంత మనియు , ఎక్కడ అనుసరణీయము గాదనియు , ఇది ఇంతవరకు ప్రచురణకు నోచు కోలేదనియు , ఏ పత్రికకు పంపలేదనియు ,
ఈ నా కవిత/గేయం మీద పూర్తి హక్కులు నావే ననియు ఇందు మూలముగా మీకు తెలుపు తున్నాను .
వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు
99890 73105
--------------------------------------------------------------------------------------

No comments:
Post a Comment