కవి: వారణాసి భానుమూర్తి రావు.
కవిత శీర్షిక :
పాపం చెల్లెమ్మ !
సర్రున
నేల కొరిగిన ఆకాశం నుండి
నక్షత్రాల వాన
గగనం గడ్డ మీద
తెల్లని మైలు రాయిలా
చంద్రోదయం
మూసుకొన్న రహదారులు
భయం వేస్తున్న అడుగులు
లయ తప్పిన ఎద సవ్వడులు
చీకటి నేసిన దుప్పట్లలో
ఆ నిశి రాత్రిలో
దారి తప్పిన చెల్లెమ్మ
చుక్కలు వెలిగించిన వెలుగు
ఆమె వదనంలో జారిన
చిరుచెమటల దిగులు
డిల్లి వార్తల్లొ గుప్పుమన్న
'నిర్భయ ' ఆక్రందనలు
ఎదురుగా ఒక మనిషి
మృగం లాంటి మగ మనిషి
ఓ అమ్మ కన్న కొడుకైనా
ఈ చెల్లెమ్మ పాలిట కామాంధుడు
శీలం పగిలి పోయిన
అందాల గాజు బొమ్మ
హృదయం లేని మగాడు
ఆమె పాలిట మృగాడు
గవర్నమెంట్ ఆసుపత్రిలో
కత్తెరల పోస్ట్ మార్టం
పేపర్లో పారాడిన వార్తల బల్లి
'కామాంధుడికి అబల బలి '
ఈ 'రేపుల 'రాజ్యం లో
ఈ వార్తలు మామూలే!
అడవులకు పూచిన పుష్పాలు
అలా రాలి పొవలసిందే!
(రాసిన కాలం: 28.05.2013)
పేరు: వారణాసి భానుమూర్తి రావు
తేది: 29.05.2017
వూరు: హైదరాబాద్
No comments:
Post a Comment