రాళ్లే మృదంగాలై
మొద్దులే మద్దెలై
ఎండు కొమ్మలే తంబురలై
గిరిబాలల గుండెల్లో సంగీతం విప్పారిందా !
గులక రాళ్ళల్లో సరిగమలు చిందెయ్యదా !
గాలి కొనల్లో తేలియాడే మధుర నాదాలకు
అడవి తల్లి మురిసి పోదా !
వసంతం అక్కడే ఉండి పోదా !
మొద్దులే మద్దెలై
ఎండు కొమ్మలే తంబురలై
గిరిబాలల గుండెల్లో సంగీతం విప్పారిందా !
గులక రాళ్ళల్లో సరిగమలు చిందెయ్యదా !
గాలి కొనల్లో తేలియాడే మధుర నాదాలకు
అడవి తల్లి మురిసి పోదా !
వసంతం అక్కడే ఉండి పోదా !
No comments:
Post a Comment