నదిగా మారింది !
నా శరీరం మీద ఒక నది నిలువునా ప్రవహిస్తోంది
పాయలు పాయలుగా ప్రవహించినా
నది ఒక చోట కలిసి ముందుకు ఉరుకుతోంది
గుండె బద్దలయిన చోట
ఒక సుమాని గా మారుతోంది
వికృత ధర్మాల్ని ఒంపుకొన్న వళ్ళు
సుడిగుండమై కంపించింది
కళ్ళు కర్కశ దృశ్యాల్ని నమిలి నపుడు
జల ప్రళయమై జ్వలించింది
నా శరీరమిపుడు
నదిగా మారింది!
No comments:
Post a Comment