పిల్లలు- తల్లి తండ్రులు
కొందరు తల్లి తండ్రులు పిల్లల్ని ఎందుకు కంటారో అర్థం కాదు. పిల్లల్ని వీళ్ళే కన్నట్లు , వీళ్ళే గొప్పగా పిల్లల్ని పోషిస్తున్నట్లు అనుకొంటారు. కొందరు తల్లి తండ్రులు క్రమశిక్షణ పేరుతొ పిల్లలకి నరకాన్ని చూపిస్తారు. నాకు తెలిసిన ఒక జంట వాళ్ళ పిల్ల వాడికి కుక్కను బంధించినట్లు ఇంట్లో పెట్టి బయట తాళం వేసి పోతారు , ఇంట్లో ఆయాను తోడుగా పెట్టి. ఇంత కన్నా దారుణం మరొకటి ఉందా ? కొందరు అది తినొద్దు ఇది తినొద్దు అని ఎన్నో conditions పెడతారు . ఐస్ క్రీం వద్దు, పిజ్జా , బర్గర్ తినొద్దు అని పిల్లల్ని సతాయిస్తారు . ప్రేమ చూపిస్తూనే పిల్లల్ని మానసికంగా వేధిస్తూ ఉంటారు . ఏదయినా ఒక పార్టీ వెళ్లి నట్లయితే , అక్కడికి వెళ్లొద్దు, అది తినొద్దు , disturb చెయ్యవద్దు అని గద మాయిస్తారు .
మాకు తెలిసిన ఒక పెద్దాయన పిల్లల్ని గొడ్డును బాదినట్లు బెల్ట్ తో కొట్టే వాడు. ఏమయ్యా అంటే 'మొక్కై వంగనిది మాను వంగుతుందా 'అనే వాడు. పిల్లల్ని అలా కొట్టడం ఎంత వరకు సబబు? స్కూల్ లో టీచర్లు , ఇంట్లో తల్లి తండ్రులు పిల్లలకి నరకాన్ని చూపిస్తున్నారు.
కొందరు పిల్లల్ని బానిసల్లాగా ట్రీట్ చేస్తారు. మంచినీళ్లు , పేపర్ అందుకో, టీవీ రిమోట్ ఇవ్వు , అని చెప్పిన పని చెపుతూనే ఉంటారు. పెద్ద వాళ్లకి లేచి నిలబడి పనులు చేసు కోవడం బద్ధకం , అందుకే పిల్లలకి పనులు పుర మాయిస్తూ ఉంటారు. సెల్ఫ్ డిసిప్లిన్ పేరుతొ పిల్లలకి నరకాన్ని చూపిస్తారు.
మా చిన్నపుడు మా స్కూల్లో , పిల్లలు స్కూల్ కి రాకపోతే , ఒక పెద్ద కొయ్య తుండు ని కాలికి గొళ్లెంతో తగిలించి వారు. లేదంటే ఎండలో గోడ కుర్చీ వెయ్యమని చెప్పేవారు. ఈ శిక్షలు ఎంత వరకు సబబో ?
కొందరు తమ ఆఫీస్ టెన్షన్ అంతా పిల్లల మీద చూపిస్తారు . కొట్టడం , తిట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. తల్లి తన భర్త మీద , అత్త మామల మీద ఉన్న కోపాన్ని పిల్లల మీద చూపిస్తూ ఉంటుంది.
మన దేశం లోనే గాకుండా , విదేశాల్లో సైతం పిల్లల మీద అరాచకాలు ఎక్కువ అయినాయి. పిల్లల్ని హ్యూమన్ షీల్డ్స్ గా వాడుకొంటూ పిల్లని చంపే నరహంతకుల వార్తల్ని చూస్తూ ఉన్నాము.
ఇటీవల ఒక తల్లి తండ్రి తమ బిడ్డని కార్లో లాక్ చేసి హోటల్ కెళ్ళి టిఫిన్ చేసారంట . ఇది ఇటీవల జరిగింది . ఆ పిల్ల ప్రాణ వాయువు అందక ఒకటే ఏడ్పు. బయటి వాళ్ళు చూసి ఆ పేరేంట్స్ కి తగిన బుద్ది చెప్పారు. పిల్లల్ని కార్లో AC on చేసి , బయట షాపింగు చేసి వచ్చిన పేరెంట్స్ బిడ్డ శవాన్ని చూసి లబో దిబో అన్న కేసులు ఎన్నో ఉన్నాయి .
ఒక పది సంవత్సరాల పిల్ల చిన్న పిల్లని చూసుకోవడానికి పనికి కుదిరింది ఒక ఇంట్లో. ఆ పిల్ల పని పసివాడ్ని చూసుకోవడమే. ఒక హోటల్ కి వెళ్ళినపుడు, వాళ్లంతా బాగా మెక్కుతూ ఉంటె ఆ పదేళ్ల పిల్ల చిన్న పిల్ల ను చూసుకొంటూ , నిలబడే ఉంది. వాళ్ళు కూర్చోమని , టిఫిన్ తినమని చెప్పడం లేదు. నాకు కోపం వచ్చి , ఆ అమ్మాయిని మీ ప్రక్క కూర్చో మని చెప్ప వచ్చు గదా అన్నాను . 'నీ పని నువ్వు చూసుకో' అని నన్ను కొట్టేంత పని చేశారు.
పిల్లల్ని బూచి , దెయ్యం అని భయ పెట్టి వాళ్ళను పిరికి వాళ్ళుగా తయారు చేస్తున్నారు. బొద్దింక లను చూ స్తే భయం, బల్లుల్ని చూస్తే భయం. పురుగుల్ని చూస్తే భయం కొందరికి .
పెద్ద వాళ్ళే భయం , భయం అంటే పిల్ల వాళ్లకు భయం గాక మరి ఏమౌతుంది ?
పిల్లల మీద దౌర్జన్యాలు ఎక్కువ అవుతున్నాయి నేటి సమాజంలో . ఆరేళ్ళ పిల్లల్ని టీవీ రియాలిటీ షోస్ లో హింస పెడుతున్నారు కొందరు. పసి వాడని పిల్లల్ని పెద్ద పనులకి పురమాయిస్తున్నారు. బాల కార్మికులుగా పడ రాని పాట్లు పడుతున్నారు . చట్టాలు ఎన్ని ఉన్నా అవి అన్ని తుంగలో తొక్కుతున్నారు.
పిల్లలు ఎదో సాధించాలని , కరాట్టే , భరత నాట్యం , యోగ , కూచిపూడి , బాడ్ మింటన్, క్రికెట్ లాంటివి సాధన కోసం అందరి దగ్గర కోచింగ్ కి డబ్బులు కట్టి పిల్లల్ని కట్టు బానిసల్లా తయారు చేస్తారు.

పిల్లల మనస్వత్తాన్ని మనము సరిగా అర్థం చేసు కోవడం లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే తల్లి తండ్రి ని చూసి భయపడే పిల్లలు నోరు తెరచి ఏమి అడగ గలరు ?
క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని హింసించ వద్దని నా మనవి. అల్లాగే మన బాధల్ని , టెన్సన్స్ ని వాళ్ళ మీద రుద్దడం గూడా భావ్యం గాదు . పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచితే అంత ప్రేమను మనము పొంద వచ్చు.
No comments:
Post a Comment