అగ్నిపూలు
అదిగో
ఆ బురద నీటిలో ఆకలి చేపలు
ఎలా తల్లడిల్లుతున్నాయో
ఎలా మల్లగుల్లాలు పడుతున్నాయో చూడు
తాటాకు చప్పుళ్ళలో
వాన చినుకు శబ్దంలో
గుండె గూడై
చూరు చెరువై
ఎండ మావై
భ్రమలు కల్పిస్తున్న జీవితం
తలక్రిందులై కన్పిస్తుంది నాకు
ఈ మాయా దర్పణంలో
అదిగో
జీవ హరితాన్ని హరించి
పేలవంగా బొమికలతో
శ్మశానంలో పీనుగు కాలిన
పొగల్లా పారాడే
శిలల్లాంటి శవాలు
బ్రతుకే చూడని అనుభవాలు
అదిగో
మానవ హారానికి
దారాల్లా నిలబడ్డ కాగడాలు
వెలుతురు చుక్కలు మ్రింగి
చీకటి తుఫానులో
చిక్కుకొన్న వాళ్ళు
దిక్కూ మొక్కూ లేక
అసృక్కుల ఏరులో
అప్రచ్చన్నమైన అహ్రీకులు
వాళ్ళ ఘర్మ జలానికి
వాళ్ళ ధర్మ జలానికి
రాలి పడ్డ శ్వేత బిందువులు
నేల మీద పడి అగ్ని పూలవుతున్నాయి
వాళ్ళు పలికిన ప్రతి మాట
అంకుశం తగిలిన భూమిలో
అంకురమై
అక్షరమై
జన జాతిని జాగృతం చేస్తుంది
మానవత పరిమళాల్ని వెదజల్లుతుంది
అదిగో
ఆ బురద నీటిలో ఆకలి చేపలు
ఎలా తల్లడిల్లుతున్నాయో
ఎలా మల్లగుల్లాలు పడుతున్నాయో చూడు
తాటాకు చప్పుళ్ళలో
వాన చినుకు శబ్దంలో
గుండె గూడై
చూరు చెరువై
ఎండ మావై
భ్రమలు కల్పిస్తున్న జీవితం
తలక్రిందులై కన్పిస్తుంది నాకు
ఈ మాయా దర్పణంలో
అదిగో
జీవ హరితాన్ని హరించి
పేలవంగా బొమికలతో
శ్మశానంలో పీనుగు కాలిన
పొగల్లా పారాడే
శిలల్లాంటి శవాలు
బ్రతుకే చూడని అనుభవాలు
అదిగో
మానవ హారానికి
దారాల్లా నిలబడ్డ కాగడాలు
వెలుతురు చుక్కలు మ్రింగి
చీకటి తుఫానులో
చిక్కుకొన్న వాళ్ళు
దిక్కూ మొక్కూ లేక
అసృక్కుల ఏరులో
అప్రచ్చన్నమైన అహ్రీకులు
వాళ్ళ ఘర్మ జలానికి
వాళ్ళ ధర్మ జలానికి
రాలి పడ్డ శ్వేత బిందువులు
నేల మీద పడి అగ్ని పూలవుతున్నాయి
వాళ్ళు పలికిన ప్రతి మాట
అంకుశం తగిలిన భూమిలో
అంకురమై
అక్షరమై
జన జాతిని జాగృతం చేస్తుంది
మానవత పరిమళాల్ని వెదజల్లుతుంది
No comments:
Post a Comment