నేను మగ వాడిని !
----------------------------------------------
అనుకొంటాను నేను
నా శ్రీమతిని కష్ట పెట్టవద్దని
అనుకొంటాను నేను
నా శ్రీమతికి వంటింట్లో సహాయం చేయాలని
అనుకొంటాను నేను
నా శ్రీమతిని ఒక ఫారిన్ టూర్ కైనా పిలుచుకు పోవాలని
అనుకొంటాను నేను
ఆఫీసు నుండి తొందరగా ఇంటికి వచ్చెయాలని
అనుకొంటాను నేను
మా చిన్నోడి డైపెర్లు నేనే మార్చాలని
అనుకొంటాను నేను
మా పెద్దోడి షూ నేనే పాలిష్ చెయ్యాలని
అనుకొంటాను నేను
నా చోక్కా బొత్తాలు నేనే కుట్టు కోవాలని
అనుకొంటాను నేను
నా శ్రీమతిని ఇక విసుక్కోగూడదని
అనుకొంటాను నేను
నాకు జ్వరం వచ్చి నప్పుడల్లా నా శ్రీమతి నాకు చేసే సపర్యలు
నేను గూడా శ్రీమతి కి అలాగే చేయ్యాలని
అనుకొంటాను నేను
మా మామయ్య అత్తమ్మ వచ్చి నపుడు
వ్యంగంగా నర్మ గర్భంగా మాట్లాడ గూడదని
అనుకొంటాను నేను
నా శ్రీమతిని ప్రతి చిన్న విషయానికి విసుక్కోగూడదని
అనుకొంటాను నేను
నా శ్రీమతిని పక్కింటి మాధురి తో పొల్చగూడదని
అనుకొంటాను నేను
సినిమా చూసి నపుడల్లా ఆ హీరోయిన్ అందాల్ని పొగడగూడదని
అనుకొంటాను నేను
కట్నం పేరుతొ నా శ్రీమతిని నొప్పించ గూడదని
అనుకొంటాను నేను
పది మందిలో నా శ్రీమతిని కించ పరచ గూడదని
గానీ ...
నేను మా నాయన కంటే చాలా మంచోణ్ణి !
ఎందుకంటే ....
నేను ఇంట్లోకి రాగానే కాళ్ళని కడగ మన లేదు
నా ఎంగిలి కంచంలో అన్నం తిన మన లేదు
నాకు టవల్ అందించ మన లేదు
నా స్నానానికి నీళ్ళు తోడ మన లేదు
నా బట్టలు ఇస్త్రి చెయ్య మన లేదు
భొంచేస్తున్నపుడు విసన కర్రతో విసర మన లేదు
భోజనం అయిన తర్వాత చిలకలు చుట్టి తాంబూలం ఇవ్వ మన లేదు
నా కాళ్ళు వత్త మన లేదు
పండగలప్పుడు అభ్యంగన స్నానం చేయించమని చెప్పలేదు
నెలకు మూడు రోజులు ముట్టు, మైల అని బయట ఉండమని చెప్పలేదు
నా శ్రీమతి అంటే నాకు చాలా ఇష్టం , ఆమె నా ప్రాణం
గానీ ...
ఎక్కడో నాలో ఒక మగ అహంకారం నన్ను తట్టి లేపుతోంది
నేను మగ వాడి నని !!!
( 08.03 . 2015 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు రాసిన కవిత , మాతృ మూర్తి లందరికీ అంకితం )

No comments:
Post a Comment