అంతా ఒక నాటకం !
ప్రేమ ఒలక బోసే నాటకాలు
మరీ రక్తి గడుతున్నాయి
విరామం లేకుండా
విసుగు లేకుండా
కుంపట్ల మీద
నిప్పులు ఉడుకుతున్నా
పెదాల మీద
నవ్వులు పూస్తున్నాయి
పిల్లల భారతంలో
కర్ణులు తండ్రుల
కవచ కుండలాలు
తరుక్కు పొయ్యాయి
ఎక్కడ డబ్బు
విత్తనాలు జల్లారో
అక్కడ ప్రేమలు
పండుతున్నాయి
ఎన్ని ప్రభందాలు రాసినా
బీష్మ పితామహుల
శస్త్ర శయనం
తప్పేట్లు లేదు
06. 01.2015
భాను వారణాసి
ప్రేమ ఒలక బోసే నాటకాలు
మరీ రక్తి గడుతున్నాయి
విరామం లేకుండా
విసుగు లేకుండా
కుంపట్ల మీద
నిప్పులు ఉడుకుతున్నా
పెదాల మీద
నవ్వులు పూస్తున్నాయి
పిల్లల భారతంలో
కర్ణులు తండ్రుల
కవచ కుండలాలు
తరుక్కు పొయ్యాయి
ఎక్కడ డబ్బు
విత్తనాలు జల్లారో
అక్కడ ప్రేమలు
పండుతున్నాయి
ఎన్ని ప్రభందాలు రాసినా
బీష్మ పితామహుల
శస్త్ర శయనం
తప్పేట్లు లేదు
06. 01.2015
భాను వారణాసి
No comments:
Post a Comment