పిల్లలూ దేవుడూ చల్లని వారే !
( వచన కవిత్వం)
----------------------------------------
ప్రతి రోజూ బోర్ కొట్టకుండా నేను మా మనమ రాలిని తీసుకోని అలా పార్కింగ్ కి వెడతాను . అక్కడ చిన్నపిల్లలు అందరు సరదాగా ఆడుకుంటారు . అక్కడ మెక్సికన్ , కెనడా , అమెరికా , ఇండియా , పాకిస్తాన్ , ఇరాన్ , శ్రీ లంక, యూరప్ పిల్లలు అందరు ఒక్కటిగా ఆటల్లో మునిగి సరదాగా ఆడుకొంటున్నారు , అల్లరి చేసుకొంటూ , ఒకర్ని ఒక్కరు పట్టుకొంటు , స్లయిడింగ్ , రైడర్స్ ఆడుకొంటున్నారు .
ఆ పిల్లలకి భాష తెలియక పోయినా , ఏ ప్రాంతం వాడో తెలియక పోయినా సరదాగా ఆడుకొంటున్నారు .
గానీ వచ్చిన బాధంతా మనతోనే !
మెక్సికన్ వాణ్ని చూసి వీళ్ళ దేశం లో డ్రగ్స్ మాఫియా రాజ్యం ఏలుతోంది !
కెనడా దేశం వాణ్ణి చూస్తే వీళ్ళు అందరికి migration ఇచ్చేస్తారు !
అమెరిక వాణ్ణి చూస్తే అంత అమాయకుడేం గాదు అన్పిస్తుంది !
పాకిస్తాన్ వాణ్ణి చూస్తే వీడు మన దాయాది , మన మీద టేర్రరిజం చేస్తున్నాడు !
ఇరాన్ వాణ్ని చూస్తే ఇరాని చాయ్ గుర్తొస్తుంది !
శ్రీ లంక వాణ్ని చూస్తే మన తమిళుల ఊచకోత గుర్తోస్తుంది !
యూరప్ వాణ్ని చూస్తే మత ముష్కరుల చేతిలో చచ్చిన సంపాదకుడు గుర్తొస్తాడు !
గాని మన ఇండియా వాణ్ణి చూస్తే గుండె చెరువవుతుంది !
కుల మత పీడ అక్కడ గూడా అంట గడుతున్నాడు . అంతే గాదు ప్రాంతీయ విద్వేషాలు , భాషా బేధాల తెగులు అక్కడ గూడా అంటిస్తున్నాడు . తెలిసి తెలియ నట్లు నటిస్తున్నాడు. మనిషి కన బడితే కనీస పలకరింపు గూడా
లేకుండా మొహం తి ప్పు కొం టున్నాడు . నాగరికత తెలివి మీరి పోయిందో , లేదా డాలర్ల మోజులో పడి మానవ సంబంధాలు మరచి పొయ్యారో తెలియడం లేదు .
నేను అలా మనసులో మధన పడుతున్నా , నా మనమ రాలు అన్ని దేశాల పిల్లలతో ఎంచక్కా అందరితో చెట్ట పట్టాల్ వేసుకొని సరదాగా ఆడుకొంటున్నది .
అందుకోనేమో పిల్లలు దేవుడితో సమానం అని అంటారు . మనమంతా పిల్లల లాగుంటే ప్రపంచమంతా ఎంత బాగుంటుందో !
భాను వారణాసి
30. 01 . 2015

No comments:
Post a Comment