వినరా వినరా నరుడా !
-------------------------------------------------
వళ్ళు వంచితే సుఖం దొరుకుతుంది
పని చేస్తే మనీ నీదవుతుంది
నక్క వినయాలు , వంకర పనులు
చంచా పనులు ,దందాలు
లాభం లేదు తమ్ముడు
పని నేర్చుకో
పబ్బం గడుపుకో
తెలివి ఒకడబ్బ సొమ్ము గాదు
సదవాలే సదవాలే
సదివింది పది మందికి ఉపయోగపడాలే
కష్ట పడాలే కష్ట పడాలే
కష్ట పడి పదిమందికీ సాయం చెయ్యాలె
అమ్మగారికి కూరగాయలు పంపుడ్లు
పిల్లలను స్కూళ్ళకు దింపుడ్లు
అయ్యగారి కాళ్ళు పిసుకుళ్ళు
ఇవన్ని పని చేత గాని చవటమ్మలకు
మనిసి అన్నాక కళా పోసన తో పాటు
అభిమానం ఉండాలే
ఆత్మను సంపుకొని ఎన్నాల్లని బతుకు తావు
కాకి గుడ్లు పెట్టేసి పారి పోతుంది
కోయిల దాని గుడ్లను పొదిగి కాపాడు తుంది
పిల్లి పాలు తాగుతుంది
అలాగే ఇంట్లో వేసి కొడితే
పిల్లి పులయి నిన్ను రక్కుతుంది
కోడి పిల్లని తాకి చూడు
కోడి పెట్ట నిన్ను తరుముతుంది
కుక్క విశ్వాసం గలదె
బతుకంతా కుక్క బతుకు కాగూడదు
గుంతల్లో పడాల్సిందే
మళ్లి బయటకు రావాల్సిందే
ఒక్క సారి వెనక్కు తిరిగి చూడు
నువ్వేమైనా సాధించావ అని
నిన్ను నువ్వే గొప్పోడు అనుకోన్నవో
గొయ్యి వేరే వాళ్ళు తవ్వరు
నీ గొయ్యి నువ్వే తవ్వుకొన్నట్లు
చేయి సాచి పని చేసావనుకో
నువ్వు ఎక్కిన కొమ్మ నువ్వే నరుక్కోన్నట్లు
వినయం ఉండాలే
పెద్ద వాళ్ళంటే గౌరవం ఉండాలే
గాని అతి వినయం ధూర్త లక్షణం
కొందరు తమను మించినోల్లు లేదంటరు
మిడిసి మిడిసి పడతరు
తడి గుడ్డతో గొంతులు కోసేటోల్లు కొందరు
రక రకాల మనుషులు తమ్ముడు
ఎవరెట్లున్నా
మనం సక్కగా ఉన్నామా లేదా
అని చూసుకోవాలె
18. 01. 2015
-------------------------------------------------
వళ్ళు వంచితే సుఖం దొరుకుతుంది
పని చేస్తే మనీ నీదవుతుంది
నక్క వినయాలు , వంకర పనులు
చంచా పనులు ,దందాలు
లాభం లేదు తమ్ముడు
పని నేర్చుకో
పబ్బం గడుపుకో
తెలివి ఒకడబ్బ సొమ్ము గాదు
సదవాలే సదవాలే
సదివింది పది మందికి ఉపయోగపడాలే
కష్ట పడాలే కష్ట పడాలే
కష్ట పడి పదిమందికీ సాయం చెయ్యాలె
అమ్మగారికి కూరగాయలు పంపుడ్లు
పిల్లలను స్కూళ్ళకు దింపుడ్లు
అయ్యగారి కాళ్ళు పిసుకుళ్ళు
ఇవన్ని పని చేత గాని చవటమ్మలకు
మనిసి అన్నాక కళా పోసన తో పాటు
అభిమానం ఉండాలే
ఆత్మను సంపుకొని ఎన్నాల్లని బతుకు తావు
కాకి గుడ్లు పెట్టేసి పారి పోతుంది
కోయిల దాని గుడ్లను పొదిగి కాపాడు తుంది
పిల్లి పాలు తాగుతుంది
అలాగే ఇంట్లో వేసి కొడితే
పిల్లి పులయి నిన్ను రక్కుతుంది
కోడి పిల్లని తాకి చూడు
కోడి పెట్ట నిన్ను తరుముతుంది
కుక్క విశ్వాసం గలదె
బతుకంతా కుక్క బతుకు కాగూడదు
గుంతల్లో పడాల్సిందే
మళ్లి బయటకు రావాల్సిందే
ఒక్క సారి వెనక్కు తిరిగి చూడు
నువ్వేమైనా సాధించావ అని
నిన్ను నువ్వే గొప్పోడు అనుకోన్నవో
గొయ్యి వేరే వాళ్ళు తవ్వరు
నీ గొయ్యి నువ్వే తవ్వుకొన్నట్లు
చేయి సాచి పని చేసావనుకో
నువ్వు ఎక్కిన కొమ్మ నువ్వే నరుక్కోన్నట్లు
వినయం ఉండాలే
పెద్ద వాళ్ళంటే గౌరవం ఉండాలే
గాని అతి వినయం ధూర్త లక్షణం
కొందరు తమను మించినోల్లు లేదంటరు
మిడిసి మిడిసి పడతరు
తడి గుడ్డతో గొంతులు కోసేటోల్లు కొందరు
రక రకాల మనుషులు తమ్ముడు
ఎవరెట్లున్నా
మనం సక్కగా ఉన్నామా లేదా
అని చూసుకోవాలె
18. 01. 2015
No comments:
Post a Comment