భాను బాణీలు 3 - చిరు కవితలు
ఈ సృష్టిలో ప్రతిదీ
ఒక అనుభూతే
చివరకు మరణం గూడా
ఒక అనుభూతే !
కనీసం నువ్వు
నలుగురుతో నైనా బాగుంటే
నీ పాడె మొయ్యడానికయినా
పనికొస్తారు!
అమ్మ ఒడిలో
ప్రపంచాన్ని మరచి పొయ్యావు
పెళ్ళాం కౌగిలిలో
అమ్మనే మరచి పోయ్యావు !
నాకింకా
నా బాల్యం గుర్తు
నేనిప్పుడు తొంభై ఏళ్ళ
పసి బాలుడ్ని !
నరికేసిన చెట్లు
మన ఇంటికి వసారాలు
గానీ రేపటి తరానికి
ఆశనిపాతాలు !
నాన్న నీకు ATM
నువ్వు చదివే దాకా
నువ్వు ఉద్యోగంలొ చేరాక
నాన్న నీకు outdated machine !
మొదటి కాన్పులో
ఆడబిడ్డ శ్రీ లక్ష్మి
రెండవ కాన్పులో
ఆడ బిడ్డ దరిద్రపు మొహం !
03.12. 2014
వారణాసి భానుమూర్తి రావు
No comments:
Post a Comment