రాసపల్లి కథలు ( 2 ) - మా ఇస్కూలు
మా పల్లిలో అదేనండి మా రాసపల్లి లో ఐదవ తరగతి వరకే ఇస్కూలు ఉన్ది. మాకు అరవ తరగతి నుండి సదవా లంటే మేము మూడు మైళ్ళు దూరంలో ఉండె మాలు కు కు బోయి సదవాల్సిందే !. అప్పుడు నేను ఐదవ తరగతిలో సదుతున్న . ఇక్కడుండే ఇస్కూలు లో గుడా మా సారు బడికి ఒస్తే గదా? వారానికి రెండు , మూడు రొజులొస్తాడు. మిగతా రోజుల్లో మమ్మల్నే సదుకొమంటా డు . నాకు బలే కోప మోచ్చేది . మీకు గొవేర్నమెంటు వొళ్లు జీతాలు ఎందుకిస్తా ఉండారు సార్ ? అని దయిర్నం జేసి అడిగినాను . మా సారుకి దానికి బలే కోపమొచ్చింది . సింత బర్ర తీసుకోని నాలుగు బెరికి నాడు. మా నాయనకు జెప్పినా ఈ ఇసయమన్తా. మా నాయన నన్నే తిట్టి నాడు .' గురుల్ని ఏమన గూడదు నాయనా! ఆళ్ళు మనకు సదువు సేప్పే వోళ్ళు . పోయి చమించమని అడుగు అని చెప్పినాడు మా నాయన . మా నాయన మీద నాకు శానా కోప మొచ్చింది . సరే నని ఆ మర్న్యాడు పోయి చమించమని అడిగినాను . సరే అని సెప్పి సిచ్చగా నాకు గోడ కుర్సీ ఎయ్యమన్నాడు. ఏమనుకోన్నాడో ఏమో గాని , నన్ను మరుసటి రోజు నుండి స్కూలు లీడెర్ని సేసి నాడు .
స్కూలు లీడర్ని అయిన్యాక , నాకు బలే పని ఆయింది . ఇస్కూలు కు పిల్లోల్లు వస్తా ఉండారా , లేదా అని సూసుకోవల్ల . రాలేదంటే వాళ్ళ ఇల్లకేల్లె ఆళ్ళను .
ఈడ్సుకొని రావల్ల . సారు ఇస్కూల్ కు ఎప్పుడొస్తాడో రాడో తెలీదు .
రానప్పుడు నా సావు నేనే సావల్ల. ఒక్కో సారి మా సారు ఇంట్లో , బయట పనులన్నీ సూసుకో ని వస్తాడు. ఆయప్పకు ఇస్కూలు పనుల కంటే బయట పనులే ఎక్కువ .
పొద్దున్నే ప్యార్తన అయినాక , నేను పిల్లోల్లందరికి క్లాసుల వారి కుస్సోమని , వాళ్ళకి ఏదో ఒక పాటమో , లెక్కలో రాసు కొమంటాను. సారు వస్తాడేమో నని మద్యాన్నం దాకా కాసు కొని ఉంటాను . రాలేదంటే మా తంటాలు మేమే పడి ఇంటికి పొయ్యే బెల్లు ముందు గానే వాయిస్తా. కొందరు పిల్లోల్లు సాయంకాలం వర్కు కోతి కొమ్మా , కబాడీ , జిల్లా కోడి ఆట ఆడతా ఉంటారు . ఆడ పిల్ల కాయలయితే దొంగాట , ముక్కు గిల్లె ఆట, కుంటాట, తొక్కు బిళ్ళ ఆట ఆడు కొంటారు .
అందుకే మా ఇస్కోల్లో ఐదవ తరగతి పాసు అయ్యి, ఆరవ తరగతి లో సేరి నోళ్ళు సాన తక్కువ. సదివే దానికి , రాసే దానికి ఒస్తే చాలని ఐదు కాడికే ఆపేసి సేద్యానికి తొల్తారు. నాకు మటుకు నాకు బాగా సదోకొని , పెద్ద ఉద్దోగం సేయ్యల్ని ఉండాది . ఎట్లయినా సారు ని మంచి సేసు కొని అన్ని నేర్చుకోవల్లని , ఐదవ తరగతి గట్టేక్కేస్తే , అరవ తరగతి లో ఐ స్కూల్లో బాగా సదువు కోవల్లని ఉండాది .
ఒక రోజు ఆ రోజు మంగళ వారం అనుకొంటా . సారు నిన్న బడికి వచ్చినాడు గాబట్టి , ఈ రోజు రాడు అని నాకు తెలుసు. అందుకె పిల్ల కాయలు గూడా రాలేదు.మొత్తం మీద పది మంది పిల్లోల్లు గూడా లేరు . నేను ఉన్న పిల్లోల్లకు ఎక్కాలు నేర్పిస్తున్నా . ' రెండు ఒక్కట్ళా రెండు ... రెండు రెండ్ల నాల్గు .. రెండు మూడ్ల ఆరు...' అని నేర్పిస్తున్న . అంత లోనే ఒక పెద్ద ఆయప్ప , ఆ ఆయప్ప ఎనకాల ఒక బంట్రోతు వచ్చి నారు మా బడిలోకి .
' మీ సార్ ఎక్కడ్రా ?' అని నన్ను అడిగాడు ఆయన కోపంగా .
అబద్దం సేప్పాలో ,నిజం సెప్పాలో తెలిలేదు నాకు .
'ఇప్పుడే వస్తానని సెప్పినాడు సార్ ' అని సెప్పినా .
ఆ సారు నా వంక చూసి నిజం చెప్పు ఆని ఉరిమి నాడు . నాకు బయం ఏసి ఉన్న ఇసయం అంతా సెప్పెసినాను.
'ఇలాంటి టీచర్లు ఉండ బట్టే , దేశం ఇలా తగల బడి పోయింది ' అన్యాడు పెద్ద సార్ .
వాళ్ళిద్దరూ మా ఇస్కూల్లో ఉన్న మా హాజరు బుక్కులు , మిగతా రి కా ర్డు లన్ని తనికి సేసినారు .
ఏమయ్యిందో ఏమో గాని , మా ఇస్కూలికి ఒక నెల వరకు మా సారు రానే రాలేదు.
ఒక రోజు , ఒక కొత్త సారు మా బడికి వచ్చి నాడు . వయసులో శానా సిన్న వాడు గా ఉండాడు .
'ఈ రోజు నుండి నేను మీకు కొత్త టిచర్ని . నేను ప్రతి రోజు స్కూలు కి వస్తాను. మీ ఉర్లోనే ఇల్లు తీసుకోని ఉంటాను . మా ఇంటికి వచ్చి రాత్రి పూట గూడా చదువుకొండి ' అన్నాడు కొత్త టిచేరు .
ఆ సారికి మా బడిలో ఐదవ తరగతి పది మంది ఉంటె అందరమూ పాస్ అయి మాల్లో ఆరవ తరగతి లో జెరినాము. ఇదంతా కొత్త సారు దయ వల్లనే .
ఇంతకూ మా పాత సారు ఏమయ్యాడో అని మా కొత్త సారుని అడిగాను .
'ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది ' అని చెప్పాడు మా కొత్త సార్ .ఆ వచ్చిన వాళ్ళు డి ఇ ఒ సార్ ' అన్న్యాడు మళ్ళి .
నాకు ఈ రెండు ఇంగిలి పీసు పదాలు అర్థం కాలేదు .
****************************************

No comments:
Post a Comment