Thursday, April 23, 2020

కరోనా అంతు చూద్దాం!




శీర్షిక:  కరోనా అంతు చూద్దాం!

******************************
కాలి పగుళ్ళపై  మొలచిన  పాదయాత్రలు
అవని గడ్డ పై  ఆరని జీవన పోరాటాలు
బ్రతుకు సిలువ పై గాయపడ్డ దీన జీవులు
కరోనా దెబ్బకు  రెక్కలు తెగిన  పక్షులు
దశ , దిశ లేని పయనంలో
ఎక్కడి కని పాద యాత్ర?
చంకన బిడ్డల్ని - నెత్తిన మూటల్ని
పెట్టుకొని ఎక్కడికని నీ జీవన యాత్ర?
కరుణ లేని కరోనా కాటుకు
విలవిల లాడిన శ్రామికుల అవస్థలు
ఎక్కడ నగరానికి విష గాలి సోకిందో
అక్కడ మానవ సమూహానికి సంకెళ్ళు
భూమి తల్లిని‌ నమ్ముకొనలేక
పల్లె నీడని బ్రతుకలేక
అనివార్య మైనది నీ వలస యాత్ర
కానీ ఇప్పుడు కరోనా కాలనాగు కాటేస్తుంటే
మళ్ళీ గమ్యం తెలియని బ్రతుకు వెతుకులాట
ఇప్పుడు నగరాలన్నీ మళ్ళీ అడవులై‌ పొయ్యాయి
క్వారంటైన్ లో గృహాలన్నీ  బందీ ఖానా లయ్యాయి
కరోనా కాంపౌండు లెక్కలతో మరణాలు‌ పెరిగి పోతున్నాయి
దిక్కు తోచని శ్రామికుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి
వలస కార్మీకుల జీవితాలు బీడు భూములయ్యాయి
మళ్ళీ‌ తిరిగొచ్చినా రేపటి బతుక్కి భరోసా లేదు
ఆపన్న హస్తం చేయి అందించినా కరోనాభయం వదలటం లేదు
కొన్ని రోజులు మాత్రం  కరోనా భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది
అయినా  ధైర్యంగా ముందుకు అడుగు లేద్దాం
కరోనా అంతు చూద్దాం! అంతం చూద్దాం!!










No comments:

Post a Comment