నేటి కవిత*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తేది : *21-09-2019*
*వారణాసి భానుమూర్తి
అంశం *నిర్వేదం*
శీర్షిక: *నిర్వేదం*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
అనిశ్చతి అభయారణ్యంలో
అవకాశ వాదుల క్రూర మృగాల మధ్య
బ్రతకడం కష్టమే !
నిర్భయంగా నడవాలనుకొన్నా
ఆటంకాల అవరోధాల లాండ్ మైన్లు
అడుగడుగునా ఆవరిస్తూనే ఉంటాయి
*నిర్వేదాల* వేదాలు
నైరాశ్యపు గీతాల్ని వినిపిస్తుంటే
ప్రతి శ్లోకమూ ఒక శోకమై
బ్రతుకు భారమయిన వేళ
మనిషి పురోగమించడం కష్టమే!
గ్రహ మండలాలు దూరమయినా
మానవుడు కాలు మోపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు
అవకాశాలు అంచులో లేక పోయినా
అందుకోవడానికి ప్రయత్నిస్తూనే వుండాలి
రానీ రాక పోనీ
కానీ కాక పోనీ
నీ ప్రయత్నం వృధా కారాదు.
No comments:
Post a Comment