కవిత్వము - పోకడలు - విమర్శ
కవిత్వ పోకడలు నానాటికి వింత దారులు తొక్కుతున్న సందర్భంలో , ఏది కవిత్వం ఏదికవిత్వం గాదు అని ఒక అభిప్రాయానికి రాలేక పోతున్నాము. వచన కవిత్వము (prose poetry ) వచ్చిన తరువాత , ఛందో బద్ధ నియమాలు లేకపోడం వల్ల, సాహిత్య పరిచయం కాస్తో కూస్తో వున్న ప్రతి వ్యక్తి తన దైన శైలిలో కవిత్వాన్ని రాయ గలుగు తున్నాడు . గానీ కాల గమనం లో ఇన్ని కవిత్వాలు నిల బడతాయా అనేది ప్రశ్న? ఎందుకంటే ఈనాడు రాసిన రాస్తున్న కవులకు ఒక నిబద్ధత , ఒక ప్రమాణం , ఒక సాహిత్య సాంగత్యం, ఒక కవి గురువు లేకపోవడమే పోవడమే కారణం . విమర్శ అనేది సూత్రం ప్రాయంగా , ద్వేషా విద్వేష రహితంగా ,సిద్ధాంత పరంగా ఉన్న విమర్శలకే ఇక్కడ చోటు ఉంటుంది . అలాంటి వారు కవులయినా , కాకా పోయినా ఇక్కడ రాయండి. ఒక కవిత్వాన్ని తీసుకొని , అందులోని గుణ గణాలను, లోటు పాట్లను సద్విమర్శతో చెయ్యండి. ఇక్కడ విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యము ఉంటుంది . మరి ఆలోచిస్తారు గదూ !
No comments:
Post a Comment