Monday, March 20, 2017

కవిత్వము - పోకడలు - విమర్శ


కవిత్వము -   పోకడలు - విమర్శ

కవిత్వ పోకడలు నానాటికి  వింత దారులు తొక్కుతున్న సందర్భంలో , ఏది కవిత్వం  ఏదికవిత్వం గాదు  అని ఒక అభిప్రాయానికి రాలేక పోతున్నాము. వచన కవిత్వము  (prose poetry )  వచ్చిన తరువాత , ఛందో  బద్ధ  నియమాలు లేకపోడం వల్ల,  సాహిత్య   పరిచయం కాస్తో  కూస్తో వున్న ప్రతి వ్యక్తి  తన దైన  శైలిలో  కవిత్వాన్ని  రాయ గలుగు తున్నాడు . గానీ కాల గమనం లో  ఇన్ని కవిత్వాలు  నిల బడతాయా అనేది ప్రశ్న? ఎందుకంటే ఈనాడు  రాసిన రాస్తున్న  కవులకు ఒక  నిబద్ధత , ఒక ప్రమాణం , ఒక  సాహిత్య  సాంగత్యం, ఒక కవి గురువు   లేకపోవడమే పోవడమే కారణం .  విమర్శ అనేది సూత్రం ప్రాయంగా , ద్వేషా విద్వేష రహితంగా ,సిద్ధాంత  పరంగా  ఉన్న విమర్శలకే  ఇక్కడ చోటు ఉంటుంది . అలాంటి  వారు కవులయినా , కాకా పోయినా ఇక్కడ రాయండి.  ఒక కవిత్వాన్ని తీసుకొని , అందులోని  గుణ గణాలను, లోటు పాట్లను సద్విమర్శతో  చెయ్యండి. ఇక్కడ విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యము ఉంటుంది . మరి ఆలోచిస్తారు గదూ !

మనకు ఒక మార్కు ఉందా ?

మనకు ఒక మార్కు ఉందా ?
--------------------------------------


మూస పోసినట్లు ఉన్న మన భావ జాలంలో  మార్పు రావాలి.  మనిషి మారాలి , తరువాత వ్యవస్థ  మారుతుంది .  మన  ఆస్థిత్వానికి  ప్రమాదమయ్యే  మార్పుల్ని  గూడా  మనం తేలికగా తీసుకొంటూ , గుమ్మడి కాయ దొంగ ఎవడ్రా అంటే  వేరే వాళ్ళ భుజాలు తడుము తున్నట్లుగా మనల్ని మనం  మోసం చేసుకొంటున్నాము. మనం ఆలోచన జ్ఞానాన్ని ఎప్పుడో  తుంగలో తొక్కాము. ఇపుడు వస్తున్న భావ జాలం  తప్పించు  కొనే   భావజాలం . ఇదే  మన ఐడియాలిజం అంటున్నాము .   మన  మన ఋషి  పరంపర  మన కిచ్చిన జ్ఞానాన్ని  తుంగలో  తొక్కాము.  అవన్నీ మనకు పుక్కిటి  పురాణాల్లా  అనిపిస్తున్నాయి. లాజిక్ కోసం  హేతు వాదుల  హిత వాదాన్ని మనము నెత్తినేసు కొని మన అస్తిత్వానికే  ప్రమాదాన్ని కొని తెచ్చు కొంటున్నాము. ఒక జాతి కి ఒక ఐడెంటిఫికేషన్ గావాలి. ఒక  మార్కు ఉండాలి.  అది మనకు  ఉందా ??

మనకు వేదాలు ఉన్నాయి. పురాణాలు ఉన్నాయి .  కొన్ని  వేల పంచతంత్రం  లాంటి  నీతి  కథలు ఉన్నాయి.  కానీ మనకు విదేశాల్లోని  హారి పాటర్ అన్నా , అలీబాబా  నలభై  దొంగలు అన్నా  చెవి తెగ్గోసు కొంటాము . మనకు  కృష్ణుడు , రాముడు లాంటి  పిల్లల  శ్రవణ , దృశ్య  నాటకాలు ఉన్నాయి . టి వి  మాద్య మాల్లో  మనము  మిక్కీ , మిన్నీ , డోనాల్డ్  లాంటి డిస్ని  చిత్రాలనే  పిల్లలకు  చూపిస్తాము .

ఛత్ర పతి  శివాజీ   మన దేశం కోసం ఎన్ని అవస్థలు  పడ్డాడో , ఆయన మహమ్మ దీయుల  దురాక్రమణకు  నిర్విర్వ మైన  హిందూ  జాతిని ఏక ధాటిగా నిలిపి  అఖండ  భారతాన్ని  ఎలా  రక్షించారో  మన పిల్లలకు మనము నేర్పించము . భగత్ సింగ్  భారత జాతి కోసం  ఉరి కంభం ఎక్కాడని  మనం ఎక్కడా మాట్లాడం .

మనకు కావాల్సింది ఈ  నెలలో ఎన్ని హిందీ సినిమా లు , ఇంగ్లీష్  సినిమాలు రిలీజ్  అయ్యాయి అని చర్చిస్తాము. ఇక్కడ గూడా తెలుగు సినిమాలు  అసలు పట్టించు కొము.

వేమన పద్యాలు, సుమతి శతకాలు , సుభాషితాలు  మనకు అక్కర లేదు.  ఒక అన్నమయ్య గీతమో , ఒక త్యాగా రాజ కీర్తనో  మనం మన పిల్లలకి నేర్పించము.

పుట్టిన పిల్లలకి ఇంగ్లీషు  రైమ్స్  నేర్పించక పోతే  అదొక్క క్రైమ్ . ఈ  రైమ్స్  బొడ్డు  తెగని పాపాయికి  గూడా  నేర్పించాలసిందే ! లేదంటే  ప్రీ ప్రైమరీ లో అడ్మిషన్  దొరకదు. మమ్మీ , డాడీ  సరే సరి. అమ్మా నాన్న అంటే నామోషీ !''  చేత వెన్న ముద్ద , చెంగల్వ పూదండ''  బదులు ''జానీ జానీ ''మన పిల్లలు  నేర్చు  కోవాలి .

'' చేత వెన్న ముద్ద, చెంగల్వ  పూదండ
బంగరు మొల త్రాడు పట్టు దట్టి ,
సందే  తాయతులను ,
సరి మువ్వ గజ్జెలు ,
చిన్ని కృష్ణ  నిన్ను  చేరి కోలతు  '' బదులుగా


''జానీ జానీ , ఎస్ పాపా
ఈటింగ్  షుగర్
నో పాప
టెల్లింగ్ లైస్
నో పాపా
ఓపెన్  యువర్ మౌత్
హ హ హ ''

మా చిన్నపుడు  మా తాత గారు వినాయక చవితికి  పూజ అయ్యేంత వరకు కదల నిచ్చే  వారు గాదు . గుంజిళ్ళు  తీసి  ప్రసాదం తిన్న తరువాతనే  భోజనానికి కూర్చోవాలి. ఇప్పుడయితే  ఐపాడ్  లో వినాయక పూజా విధానము  చూస్తూ  మమ అనిపిస్తున్నారు ఇంట్లో ఉన్న తాతో, తండ్రో . మిగిలిన పిల్లలు టీవి లో  క్రికెట్  మ్యాచ్  లేదా  ఇంగ్లీషు  సినిమా  చూస్తూ  లంచ్ ఎపుడు పెడతారో  అని వెయిట్ చేస్తూ  ఉంటారు .

ఎవరైనా  బంధువులు , స్నేహితులు  వస్తే పిల్లలు రూమ్ లలో దాక్కోవడం, నమస్కారము అని చెప్పడానికి  గూడా  నామోషీ , అతిధులు వచ్చినపుడే  మొబైల్ ఫోన్ లలో  గంటలు గంటలు మాట్లాడుతూనే ఉండడం, లంచ్ టైం కి వచ్చినా  కాఫీలలో తోనే  సరి చెయ్యడం ఇవన్నీ మన గౌరవాన్ని  ఇనుమడింప  జేస్తాయా ?

మంచి,  మానవత్వం , సభ్యత , సంస్కారము లాంటి  ఉన్న  జాతిని తయారు చేయాలంటే  మనం గూడా చాలా మారాలి. అంతే  గాకుండా  నిర్వీర్య మైన జాతిని  తయారు  చేసి నందుకు  తల్లి తండ్రులే  భాద్యత  వహించాలి.

భాను వారణాసి / 18.05.2017 

Monday, March 6, 2017

రాళ్లే మృదంగాలై!

రాళ్లే  మృదంగాలై
మొద్దులే  మద్దెలై
ఎండు కొమ్మలే   తంబురలై
గిరిబాలల  గుండెల్లో సంగీతం విప్పారిందా !
గులక రాళ్ళల్లో  సరిగమలు చిందెయ్యదా !
గాలి   కొనల్లో   తేలియాడే మధుర  నాదాలకు
అడవి తల్లి మురిసి పోదా !
వసంతం  అక్కడే  ఉండి  పోదా  !