Tuesday, September 13, 2016

మనం కవులమా ?

మనం  కవులమా ?

------------------------------------------------------------

మనం మనుషులమా ?
మనం  కవులమా??


భార్య  శవాన్ని  పది మైళ్ళు  మోసుకెళ్లిన  నిర్భాగ్యుని   అసహాయతను చూసి గూడా
ఉలిక్కి పడని  ప్రజా స్వామ్య దేశపు  బూటకాన్ని  ఎండ గట్టే కవిత్వం  రాదేంటి  ? ?

డబ్బుల్లేని  గర్భిణీ    కాలి  నడకన  చేరి  ఆసుపత్రి గేటు బయట
ప్రసవిస్తే  ఆ మాతృ మూర్తి  వేదన కవిత్వమై బయటకు రాదేంటి ??

మృగాలాంటి మనుషులకు  వత్తాసు పలికే
రాజకీయ నాయకుల  ద్వంద వైఖరిపై  దుమ్మెత్తి పొసే  కవిత్వం రాదేంటి ??

మతం ముష్కరుల  మరణ హోమం లో  సమిధలై పోతున్న
నానా జాతీయుల బాధా  సర్ప ద్రష్టల  ఆక్రందనలు  కవిత్వమై రాదేంటి ??

అడ్డమైన లెక్కలతో  కోట్లాది జనాల కష్టార్జితాన్ని బడా బాబులు  దిగ మింగుతుంటే
కడుపు నిండని అన్నార్తుల ఆకలి మంటల మీద కవిత్వం రాదేంటి ??

కవుల్లారా
కనులుండి నిజాల్ని  దాచి
అబద్దాలను  రాస్తున్నారా ??

సన్మానాలకోసం , శాలువలకోసం , చప్పట్ల  కోసం
అడ్డమైన  కవిత్వాల్ని    రాస్తున్నారా  ??

ఒక్క సారి  జనం కోసం జన్మ నెత్తిన
మహా కవులు  ఏమన్నారో  వినండి !

కవులు నిజాల్ని రాస్తారు
కవులు  జీవితాల్ని  రాస్తారు
కవులు  కన్నీళ్ల  సిరాతో  కవిత్వాన్ని రాస్తారు
కవులు  దరిద్రులయినా  మంచి కవిత్వం రాసి  మహా రాజులవుతారు
కవులు  జనం కోసం  మరణిస్తారు !!



12. 09. 2016








No comments:

Post a Comment