ప్రస్థానం
---------------------
నలిగిన , నలిపిన
చింపిన, చించిన
పగిలిన , పిగిలిన
ఒక వస్తువు ... విపణి వీధిలో ....
ఒక అంగడి బొమ్మ
నిన్నటి వరకు
ఆడుతూ , తూలుతూ
అందమైన లోకాన్నీ
అందులోని ఆర్ణవాన్ని
మాత్రమే తెలుసు కొన్న పిచ్చిపిల్ల !
రంగుల అద్దాల వెనుక
దాగిన కలల ప్రపంచం
రేపటి తన ఆశల్ని విస్కీలో కలిపేసింది
తనకు' రేపు ' గురించే తెలుసు !
'రేప్' గురించి అసలు తెలీదే !
కొంత మంది అమ్మలకు పుట్టిన వాళ్ళు గాదు
కొంత మందికి అప్ప చెల్లెళ్ళ గురించి అసలు తెలీదు
ఆ రాక్షసులు అమ్మ స్తన్యం లో కామాన్ని తాగి బతికారు
అప్ప చెల్లెళ్ళ అనురాగాలు మరచి రొమాన్స్ రౌడీల్లా తెగ బలిశారు
ఆడతనానికి వక్ర భాష్యాలు చెపుతూ వీధి కుక్కల్లా విర్ర వీగారు
అన్నయ్య ల అనుబంధమే తెలిసిన ఆ చిన్న తల్లి
గ్యాంగ్ రేపుల సైకో గాళ్ళ కాళ్ళ క్రింద పువ్వై నలిగి పోయింది
ఇపుడు చిన్నారులకు కావాల్సింది కాన్వెంట్ పాఠాలు గాదు
సాఫ్ట్ స్కిల్స్ గాదు , సరిగమలు గాదు , కూచి పూడి గాదు
పులి తోలు కప్పుకొన్న నల్ల నక్కల బిహేవియర్ స్టడీ చెయ్యాలి
అర్థ రాత్రి బెడ్ రూమ్ లో తన వంటి మీద పారాడు తున్న మగ చేతుల్ని నరకాలి
వావి వరసులు మరచి మర్మ స్థానాన్ని తడుముతున్న మామయ్యల ముఖం మీద ఆసిడ్ పొయ్యాలి
తొడ పాయసాలు పెట్టే గురువుల కళ్ళు పొడవాలి
స్నేహం పేరుతొ బాడీ మాసాజ్ లు చేసే బాయ్ ఫ్రెండ్స్ ని చర్ల పల్లి జైలు కి చేర్చాలి
వెకిలి చేష్టలు చేసే అంకుళ్ల బట్ట తల మీద నిప్పుల కుంపటి బోర్లించాలి
ప్రతి చిన్నారీ అఘోరాలా మదాంధుల శవాల మధ్య తపస్సు చెయ్యాలి
తల్లు లారా ! ప్రతి అమ్మాయికి అ , ఆ లతో పాటు అకృత్యాలు , అఘాయిత్యాలు గురించి చెప్పండి
ఏబీసీడీ తో పాటు మృగాళ్లను కని పెట్టడం ఎలా అని నేర్పించండి
అందమైన లోకంలో బ్రహ్మ జెముడు చెట్లున్నాయని చెప్పండి
అమాంతం నోట్లోకి లాక్కొనే విష పుష్పాలు ఉన్నాయని చెప్పండి
అంతే గాదు ... కార్నివోరౌస్ లాంటి చెట్లు మన మధ్య తిరుగుతూ ఉంటాయని చెప్పండి !
ఒక నవ ప్రస్థానానికి దారి చూపండి !!