కల్తీ వాదం
--------------------------
ఎవడు మనిషి ?
ఎవడు జంతువు ?
ఏమిటి బేధం ?
గుర్తించావా నువ్వు ఒక కోతికి పుట్టిన మనిషి వని
ఆలోచించావా నువ్వు ఒక మనిషికి పుట్టిన జంతువని
డార్విన్ సిద్దాంతం కంటే నీ సిద్దాంతం గొప్పదా ?
అసలు నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది
నీ చూపుల్లో ఏదో వక్రతనం పరావర్తనం చెందుతోంది
నీ మాటల్లో ఏదో వ్యంగం తనం గోచ రిస్తోంది
నువ్వు కూడా కల్తీ వాదివేనా ?
వెంపర్లాడుతున్న మనసుని కిటికీ రెక్కలు లాగి లోపలి ఈడ్సుకు రా!
తన్నుకు చస్తున్న ఈ జనాలతో మనకేమి పని లేదు బ్రదర్ !
వాళ్ళు తన్నుకు చావనీ !
కల్తి కబుర్లు చెప్పే మాయల మరాటిలతో మన కేమీ పని లేదు
పాలల్లో యూరియా విషం కలిపి అమ్ముకొనే పాపాత్ములతో అసలు పని లేదు
బతుకుల్నే బజారు పాలు చేస్తున్న కాల్ మనీ కాలే గాళ్ళ తో మన కేమి పని లేదు
కాదేది కల్తీ కనర్హం !!
కిళ్లి మరకలతో కంపు కొడుతున్న రోడ్లని మనం శుభ్రం చెయ్యలేము
కల్తీ వ్యాపారాలతో కడుపు నింపుకొనే కేటు గాళ్ళను మార్చ లేము
ఎర్ర సిరాతో రక్తాన్ని కల్తీ చేసే అమ్ముకొనే రాక్షసుల్ని మార్చాలేము
కాదేది కల్తీ కనర్హం !!
అదో అలా విను !
నిశ్శబ్దం చేసే శబ్దం భరించ గలవా ?
శబ్ద విరామంలో గూడా నిశ్శబ్ద శబ్దాన్ని వినే గ్రహణ శక్తి నీకుందా ??
నీ మనస్సు చేసే అర్తనాదాల్ని వినగలవా మిత్రమా ?
స్వల్ప విరామంలో నైనా నీ మనసు నీతో మాట్లాడనీ !
నాకే తెలుసులే ...
నిజాన్ని కక్కుతుందనే గా నీ మనస్సుని సెల్ఫీ లో బంధిచ లేక పోయ్యావు !!
భాను మూర్తి / 24. 12.2015 / Thursday

No comments:
Post a Comment