అన్వేషి
1
అతను నిద్రపోతున్నాఅదే స్పృహ
ఆతను మేల్కొని ఉన్నా అదే ధ్యాస
స్నానాల గదిలో మౌనంగా
నీటి పాటతో స్వరం కలుపుతాడు
పూజ చేస్తున్నపుడు
పుష్పాల మౌన గీతాల్ని వింటాడు
శ్రీమతి గోముగా వీడ్కోలు చెపుతున్నపుడు
వసంత గానాల్ని వింటాడు
ఆఫీసు లో కూ ర్చోన్నా
బేల చూపులు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు
ఇహ లోకాన పని చేస్తూనే
భావ లోకంలో విహరిస్తూ ఉంటాడు
2
కనబడే ఏ దృశ్య మైనా
కవిత లల్లెస్తాడు
అక్షరాల పిచ్చోడు అని కొందరన్నా
అసలు పట్టించు కోడు
3
ఇంటికి వస్తూనే శ్రీమతి సినిమా అంటే
తను రాసిన క్రొత్త కవితల్ని వినిపిస్తాడు
ఉవ్వెత్తున ఉప్పెంగే ఉప్పెన లా
భావ తరంగాల్ని రాసుకొంటాడు
4
ప్రపంచమంతా మునిగి పోయినా
తను కూర్మా వతారం ఎత్తిన విష్ణు మూర్తి లా
భావ సాగరంలో మునిగి కవిత లల్లుతాడు
5
ప5క్క లోపడుకొన్న శ్రీమతి నిద్ర పోయే వరకు ఆగి
తన మిద వేసిన శ్రీమతి చెయ్యిని సుతారంగా ప్రక్కకు లాగి
మౌని లా కవన తపస్సు లోకి జారుకొంటాదు
ఎన్ని గంటలో ఎన్ని జాములో
రాత్రి అలా జారి పోతున్నా
లోకమంతా నిద్ర పోతున్నా
రాస్తూనే ఉంటాడు రాత్రి సూర్యుడై !
6
ప్రోద్దస్త మానము మీ పిచ్చి గీతలూ మీరూనూ
అని విసుక్కొన్న శ్రీమతి కి ఒక నవ్వు విసిరి వేస్తాడు
పిల్లల కోసమని సినిమా కెళ్ళినా
నేటి సినిమా ప్రభావం అని ఒక్క కవితను సరి చేసుకొంటాడు
7
మదిలో అరాటం
ఎదలో పోరాటం
ఏదో రాయాలని
ఏమో చెయ్యాలని
ఆత్రుత తపన వేదన
8
అతనే పశ్చిమాన ఉదయించే సూర్యుడు
అతనే తూర్పున అస్తమించే సూర్యుడు
పగలు రాత్రి తేడా తెలియని అనిత్యుడు
కవిత్వానికి జీవితానికి తేడా తెలియని అమాయకుడు
తన నీడలోనే తను వెలుగును చూసుకొంటున్నఅపరాజితుడు
తన కోసం తానెప్పుడు జీవించని మహా మనిషి
భావ లోకం లోనే విహరిస్తున్న భావేన్వేషి
అతడు నిరంతర తపస్వి .
భాను వారణాసి
13.01. 2015
1
అతను నిద్రపోతున్నాఅదే స్పృహ
ఆతను మేల్కొని ఉన్నా అదే ధ్యాస
స్నానాల గదిలో మౌనంగా
నీటి పాటతో స్వరం కలుపుతాడు
పూజ చేస్తున్నపుడు
పుష్పాల మౌన గీతాల్ని వింటాడు
శ్రీమతి గోముగా వీడ్కోలు చెపుతున్నపుడు
వసంత గానాల్ని వింటాడు
ఆఫీసు లో కూ ర్చోన్నా
బేల చూపులు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు
ఇహ లోకాన పని చేస్తూనే
భావ లోకంలో విహరిస్తూ ఉంటాడు
2
కనబడే ఏ దృశ్య మైనా
కవిత లల్లెస్తాడు
అక్షరాల పిచ్చోడు అని కొందరన్నా
అసలు పట్టించు కోడు
3
ఇంటికి వస్తూనే శ్రీమతి సినిమా అంటే
తను రాసిన క్రొత్త కవితల్ని వినిపిస్తాడు
ఉవ్వెత్తున ఉప్పెంగే ఉప్పెన లా
భావ తరంగాల్ని రాసుకొంటాడు
4
ప్రపంచమంతా మునిగి పోయినా
తను కూర్మా వతారం ఎత్తిన విష్ణు మూర్తి లా
భావ సాగరంలో మునిగి కవిత లల్లుతాడు
5
ప5క్క లోపడుకొన్న శ్రీమతి నిద్ర పోయే వరకు ఆగి
తన మిద వేసిన శ్రీమతి చెయ్యిని సుతారంగా ప్రక్కకు లాగి
మౌని లా కవన తపస్సు లోకి జారుకొంటాదు
ఎన్ని గంటలో ఎన్ని జాములో
రాత్రి అలా జారి పోతున్నా
లోకమంతా నిద్ర పోతున్నా
రాస్తూనే ఉంటాడు రాత్రి సూర్యుడై !
6
ప్రోద్దస్త మానము మీ పిచ్చి గీతలూ మీరూనూ
అని విసుక్కొన్న శ్రీమతి కి ఒక నవ్వు విసిరి వేస్తాడు
పిల్లల కోసమని సినిమా కెళ్ళినా
నేటి సినిమా ప్రభావం అని ఒక్క కవితను సరి చేసుకొంటాడు
7
మదిలో అరాటం
ఎదలో పోరాటం
ఏదో రాయాలని
ఏమో చెయ్యాలని
ఆత్రుత తపన వేదన
8
అతనే పశ్చిమాన ఉదయించే సూర్యుడు
అతనే తూర్పున అస్తమించే సూర్యుడు
పగలు రాత్రి తేడా తెలియని అనిత్యుడు
కవిత్వానికి జీవితానికి తేడా తెలియని అమాయకుడు
తన నీడలోనే తను వెలుగును చూసుకొంటున్నఅపరాజితుడు
తన కోసం తానెప్పుడు జీవించని మహా మనిషి
భావ లోకం లోనే విహరిస్తున్న భావేన్వేషి
అతడు నిరంతర తపస్వి .
భాను వారణాసి
13.01. 2015
No comments:
Post a Comment