శీర్షిక : బాల కార్మీకులు
*************************************
లేత చెంపలపై కారుతున్న రక్తాశృవులు
పూవులాంటి సుతిమెత్తని చేతులతో
సమాజంలోని కుళ్ళును మోస్తూ సున్నిత
చేతులే రాతి బండలై రక్త మోడుతున్న
ఈ చిన్నారులకు ఎంత కష్టం? ఎంత కష్టం??
ఎండకు వానకూ వాలిపోతూ సడలి పోతూ
కృంగిన హృదయాన్ని రేపటికోసం మోసుకొంటూ
జీవితమంటే అర్థం కాని వయసులో
బ్రతుకుల్ని పెట్టుబడి దారీ వ్యవస్థకు బలి చేసిన
బాల కార్మీకులకు ఎంత కష్టం ? ఎంత కష్టం ?
ఎన్ని చట్టాలున్నా బాల కార్మీకులు శిలువకు
నిలబెట్టిన బాల ఏసులై శ్రమ బానిసలై
బ్రతుకంటే రాళ్ళూ రప్పలు మొయ్యడమేనా?
చిన్నారి బాలల బ్రతుకుల్లో ఛిద్రమైన ఆశలు
మోడుబోయిన పసి వాళ్ళకు ఎంత కష్టం ?
కూలి డబ్బులు అమ్మ అయ్య చేతుల్లో
పెట్టి ఆ రోజు కడుపు నింపుకోవడమే!
భవిష్యత్తు మీద భరోసా లేని అభాగ్యులు
బాల కార్మీకులు లేని సమాజాన్ని చూడాలి!
వారికి మేమున్నామంటూ ప్రభుత్వాలు
చేయూత నివ్వాలి! చేయూత నివ్వాలి!!
**************************************
వారణాసి భానుమూర్తి రావు
18.07.2024