వారణాసి భానుమూర్తి రావు తెలుగు రచయిత
జీవిత విశేషాలు
వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో 1956 లో జన్మించాడు. అతను వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు , వచన కవితలు రాస్తున్నాడు. ఇప్పటికి అతను 50 కథానికలు, 600 దాకా వచన కవితలు రాశాడు. అతని కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో 1981 లో జీవన గతులు అనే కథ అచ్చయ్యింది. తరువాత ' ఈ దేశం ఏమై పోతోంది? ' అనే అదివారం ఆంధ్రప్రభ దిన పత్రిక లో అచ్చయ్యింది. ఆంధ్ర జ్యోతిలో పది కథలు దాకా అచ్చయ్యాయి. నల్లటి నిజం, జన్మ భూమి , అంతర్యుద్ధం , వాన దేముడా[2] లాంటి కథలు అచ్చు అయ్యాయి. 2000లో "సాగర మథనం ", 2005 లో " సముద్ర ఘోష" అనే కవిత సంకలాల్ని ప్రచురించాడు[3].అందులో "సముద్ర ఘోష" పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి. నారాయణ రెడ్డి విడుదల చేసారు. అతను రాసిన కథ "పెద్ద కొడుకు" భావగీతి ప్రతిలిపి 2014 కథల పోటీలో ప్రతిలిపి ద్వారా ప్రత్యేక బహుమతి పొందింది.[4].వారణాసి భానుమూర్తి రావు రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు.ఇప్పుడు రాచపల్లి కథలు అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ కథా సంకలనంగా తెస్తున్నారు.అలాగే తన మొట్టమొదటి నవలా ప్రక్రియను సంస్కార సమేత రెడ్డి నాయుడు తెలుగు వారి కోసం వ్రాయడం ముగిసింది.ఆ తరువాత వరూధిని ప్రవరాఖ్య శృంగార ప్రబంధ కావ్యాన్ని తమ దైన శైలిలో నవలను వ్రాస్తున్నారు. ఇది త్వరలో పాఠక లోకానికి అందిస్తారు.కరోనా పై వీరు రాసిన కవిత ఆంధ్ర ప్రభలో ప్రచురించారు.సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ ను కనబరచిన వీరికి సాహితీ భూషణ , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ ,సహస్ర కవి రత్న అనే బిరుదులు లభించాయి. సాహిత్య ప్రస్థానంలో ' చినుకు మాట్లాడితే!'అనే కవిత ప్రచురించారు.
వారణాసి భానుమూర్తి రావు గారు ఇటీవల అనగా ఏప్రిల్ నెల 2022 లో రెండు పుస్తకాలు పాఠక లోకానికి అందించారు. 1. మట్టి వేదం కవితా సంకలనం 2. సంస్కార సమేత రెడ్డి నాయుడు తెలుగు నవల . తెలుగు కవులు లో వారణాసి వారి కథలు రాయల సీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కలిగి వుంటాయి.చిత్తూరు జిల్లా కథా రచయితలు కు చెందిన వారణాసి భానుమూర్తి గారి కథలు , కవితలు వివిధ ఆన్ లైన్ పత్రికలలో వచ్చాయి. త్వరలో మరి కొన్ని నవలలు , కథా సంపుటాలు , కవితా సంకలనాలు వెలువడుతున్నాయి.ఇంతవరకు మూడు కవితా సంకలనాలు , ఒక నవలను పాఠక లోకానికి అందించారు.
విద్యాభ్యాసం
వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగినది.
ఐదవ తరగతి వరకూ ప్రాధమిక పాఠశాల మహల్ లో , తరువాత ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకూ మహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగింది. ఆ తరువాత తొమ్మిది , పది తరగతులు మేడికుర్తి కలికిరి చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో చదివారు. ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలకు కోర్సు ( 1970-72) మరియు బి కాం బీ.టీ కాలేజీలో (1972-75) చదివారు. తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ( 1975-77 ) ఏస్ వీ యూనివర్సిటీ లో చదివారు. వుద్యొగ నిమిత్తం హైదరాబాదు వెళ్ళిన తరువాత అక్కడ కాస్ట్ అక్కౌంటన్సీ ( FICWA) చేశారు. ప్రొఫెషనల్ అక్కౌంట్స్ లో నిష్ణాతులయ్యారు.
వృత్తి
వారణాసి భానుమూర్తి గారు అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్ గా వివిధ కార్పోరేట్ కంపెనీలల్లో పని చేశారు. హైదరాబాదు మహా నగర మంచి నీటి సరఫరా మరియు మురుగు నీటి సంస్థలో చీఫ్ జనరల్ మేనేజర్ (అక్కౌంట్స్) గా పని చేశారు.ఒక పేరు పొందిన నిర్మాణ సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్ (అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ ) గా పని చేసి వివిధ బాధ్యతలను 36 సంవత్సరాల పాటు నిర్వర్తించారు. కాస్ట్ అక్కౌంట్స్ హైదరాబాదు చాప్టర్ కి వైస్ చేర్మన్ హోదాలో బాధ్యతలను నిర్వర్తించారు.
రచనలు
వృత్తి ఏమైనప్పటికీ , ప్రవృత్తిగా కవిగా , రచయితగా రాణించారు. పదవ తరగతి నుండీ కవితలు , కథానికలు వ్రాశారు.ఇతని కథలు , కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వారణాసి గారు ఈ క్రింది పుస్తకాల్ని పాఠక లోకానికి అందించారు.
1. సాగర మథనం : 2000 సంవత్సరంలో అవిష్కరించారు. డాక్టర్ గోపీ గారు , తెలుగు అకాడమీ ప్రధాన సంచాలకులు , ఈ కవితా సంపుటి మీద ముందు మాట వ్రాసినారు.
2. సముద్ర ఘోష : 2005 సంవత్సరంలో జ్డానపీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ( సినారె) అవిష్కరించారు. ఈ పుస్తకాన్ని , పద్మ విభూషణ్ డాక్టర్ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకిత మిచ్చారు .
3.మట్టి వేదం : 70 కవితలున్న ఈ కవితా సంకలనాన్ని 2022 ఏప్రిల్ నెల 17 వ తేదీ వెలువరించారు. ఈ పుస్తకానికి కే రే జగదీష్ గారు , ప్రముఖ కవి , జర్నలిస్టు ముందు మాట వ్రాశారు
4. సంస్కార సమేత రెడ్డి నాయుడు : ఇది రచయిత గారి తొలి నవలా ప్రక్రియ. ఈ నవల 17 ఏప్రిల్ 2022 నాడు అవిష్కరణ జరిగింది. ఈ నవల రాయల సీమ కక్షలు , ఫాక్షన్ ల మధ్య ఎలా రెండు కుటుంబాలు , రెండు గ్రామాలు నలిగి పొయ్యాయో తెలిపిన కథ. శ్రీమతి రాధికా ప్రసాద్ గారు ఈ నవలకు ముందు మాట వ్రాశారు.
అముద్రిత రచనలు
5. వరూధిని ప్రవరాఖ్య : అల్లసాని పెద్దన గారి మను చరిత్రము నవలీ కరణ చేశారు. ఇది ఇంకా అముద్రితము.త్వరలో ప్రచురణకు వస్తుంది.
6. పెద్ద కొడుకు : 30 కథల సంపుటి. త్వరలో ముద్రిత మవుతుంది.
6.రాచ పల్లి కథలు : తన చిన్న నాటి అనుభూతుల్ని , గ్రామీణ ప్రాంతాల్లో తను గడిపిన అనుభవాల్ని క్రోడీకరించి వ్రాసిన కథానికలు . త్వరలో ప్రచురణకు వస్తుంది.
7.నాలుగవ కవితా సంకలనం త్వరలో వస్తుంది.
లింకులు.
https://www.gotelugu.com/telugustories/view/5793/reddamma
http://m.gotelugu.com/issue241/6033/telugu-stories/vaanademudaa/
http://m.gotelugu.com/issue255/6375/telugu-stories/vepachettu/
https://www.gotelugu.com/telugustories/view/8915/subbarao-s-horse
https://www.gotelugu.com/telugustories/view/8866/as-our-destiny
https://www.gotelugu.com/telugustories/view/9395/adivaram-agachatlu
https://www.gotelugu.com/telugustories/view/9758/athadu-aame-section-497
http://m.gotelugu.com/issue234/5875/telugu-stories/tirigedevullu/
"సారంగ సాహిత్య మాసపత్రికలో - పుష్పించిన మనిషి - కవిత".[permanent dead link]
http://www.gotelugu.com. "vaanademudaa | Gotelugu.com". http://www.gotelugu.com. Retrieved 2020-04-21. {{cite web}}: External link in |last= and |website= (help)[permanent dead link]
"Display Books of this Author". www.avkf.org. Archived from the original on 2015-05-26. Retrieved 2020-04-21.
"వారణాసి భానుమూర్తి రావు".[permanent dead link]
5.https://thapasvimanoharam.com/2022/05/07/adivaram-agachatlu/
6. https://www.gotelugu.com/telugustories/view/5793/రెద్దమ్మ
7. https://www.gotelugu.com/telugustories/view/8866/as-our-destiny
8. "ప్రతిలిపి సాహిత్య అవార్డు -2021"
https://pratilipi.page.link/R1oFnZMbmuEjiy3a9