Saturday, April 30, 2022

సంస్కార సమేత రెడ్డి నాయుడు


వారణాసి భానుమూర్తి రావు గారి కథలు రాయలసీమ నేపథ్యంలో సాగినవి గతంలో చదివి ఉన్నాను. కథలు ఎంతో చక్కగా, ఆ ప్రాంత విశేషాలు, అక్కడి పరిస్థితులు, సమస్యలు ప్రతిబింబించే విధంగా ఉంటాయి. అదే లాగా వారి నవల ఈ "సంస్కార సమేత రెడ్డి నాయుడు" కూడా, రాయలసీమ నేపథ్యంలో, ఆ ప్రాంతంలోని రెండు ఉన్నత కుటుంబాలకు చెందిన కథగా సాగుతుంది. నవలలో కథ ఒకవైపు నడుస్తుండగా,. మరోవైపు ఆ ప్రాంత విశేషాలతో పాటు,  ముఖ్యంగా చిత్తూరు గ్రామీణ ప్రాంతాల్లో,  అక్కడ జరిగే అతిపెద్ద పండుగ,  సంక్రాంతి గురించి, ఆ మూడురోజులు జరిగే సంబరాలు, ఆచార వ్యవహారాలు, తెలియజేసి, వారి ప్రాంతంలో సంస్కృతి, సంప్రదాయాలు,, ప్రఖ్యాతి గాంచిన జల్లికట్టు గురించి కూడా రచయిత నేరుగా ప్రస్తావించారు. ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే తీరు, ఎలా ఉంటాయో కూలంకషంగా వివరించి కథారూపంలో  నిక్షిప్తం చేశారు రచయిత.

 ఈ నవలకు సంబంధించిన కథనంలో మాండలీకానికి పెద్దపీట వేశారు రచయిత. ఆ ప్రాంతంలో మాట్లాడే యాసకు సంబంధించిన పదాలు రచనకు ప్రత్యేకత ఇవ్వటంతో పాటు రాయలసీమలో వాడే చాలా పదాల పరిచయం జరిగింది..

కథాగమనంలో అనేక పాత్రలు వచ్చి పోతుంటాయి.  రాయలసీమ నేపథ్యం, యాస, వారి జీవన శైలి, రెండు కుటుంబాల రాచరికపు హంగు కథనంలో కనిపిస్తుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా, బాహుదా నది గురించి ప్రస్తావన చెప్పుకోతగినది. ఆ నది పుట్టుక, రాయలసీమలో ప్రవహిస్తూ నెల్లూరు జిల్లాలో సముద్రంలో కలవటం.. ఇలాంటి వివరాలు ఇవ్వటం వలన రానున్న రోజుల్లో చదివే పాఠకులకు ఆ ప్రాంత చరిత్రను పదిలం చేసినట్లు అయింది.


శతాబ్దం క్రితం రాయలసీమలో వచ్చిన కరువు గురించి, పైగా దానిని దూబ కరువు, వలసల కరువు అంటారని, ఆ సమయంలో ప్రజలు జముడుకాయలు, దెదరాకు తిని బతికారని చదివిన వారికి విస్మయాన్ని కలిగిస్తుంది. ఆతర్వాత వచ్చిన గంజి కరువు, స్వాతంత్ర్యం తరువాత వచ్చినా, ఆ సమయంలో  ప్రభుత్వం ఆ  ప్రాంతం వారికి గంజి పోసి బతికించారు అని వివరించారు రచయిత. అంతకు మించి సంక్షేమ కార్యక్రమాలు ఏమీ చేయలేదా అనిపించింది.  క్షామం అనేది ఇంత భయంకరంగా ఉంటుందా అనే గుబులు కలుగుతుంది. రాయలసీమ, రతనాలసీమ అని చదివినవారికి, వర్షాభావం వలన రాళ్ళసీమ ఎలా అయిందో అర్థమవుతుంది. కానీ,  రతనాల సీమ సొగసు కథలో చూపించి,  గొప్ప సంస్కృతిని పరిచయం చేశారు.


కథలోకి వస్తే, బాహుదా నదికి ఇరువైపులా ఉన్న రెండు గ్రామాల మధ్య సాగుతుంది కథ అంతా. ఆ రెండు కుటుంబాల మధ్య తరాల నుంచి అన్యోన్యంగా ఉన్నా, మూడో తరంలో పిల్లలకు మధ్య జరిగే సంఘటనలు వారి మధ్య వైరాన్ని రాజేస్తాయి. చిలికి చిలికి గాలివాన లాగా ఆ వైరం రెండు గ్రామాల మధ్య పెరుగుతుంది. అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ కుటుంబాలు, ప్రజలు కూడా ఎదుటివారి ప్రాణాలు తీసేటంత కక్షలు పెంచుకుంటారు. రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటంత పగలు రగులుతూ ఉంటాయి. కొంతకాలానికి వారి రెండు కుటుంబాల మధ్య ఉన్న ఓ ముఖ్యమైన రహస్యం గురించి, రెండు గ్రామాల అధినేతలతో పాటూ ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి, ఇలాంటి పరిస్థితుల్లో వారిమధ్య సయోధ్య కుదిరిందా, లేదా,, ఎలా కుదిరింది, దీనికి కారణం ఎవరు., ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న రహస్యం ఏమిటి, ఎందుకు.దాచబడినది అనే విషయాలను రచయిత వేగవంతమైన కథనంతో సాగిస్తారు. కథతో పాటు, సంస్కృతి సాంప్రదాయాలు, ప్రాంత నైసర్గిక స్వరూపం, ఆచార వ్యవహారాలు, మాండలీకం అన్ని కలగలిపి కథలో ఇమిడ్చి రాయటం వలన రాయలసీమ ప్రాంతమైన చిత్తూరు గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. 


వారణాసి భానుమూర్తి రావుగారి నవల 'సంస్కార సమేత రెడ్డి నాయుడు' చదివిన తరువాత ఆయనకు తన ప్రాంతం గొప్పతనం గురించి పాఠకులకు పరిచయం చేయాలన్న ఆకాంక్ష స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఆయన సఫలీకృతులయ్యారు. నవల తీరుతెన్నులు గమనించిన తర్వాత ఇది రచయితకు పూర్తి సంతృప్తి ఇచ్చిన రచన అని రూఢీ అవుతుంది.. 

మున్ముందు ఇంకా ఇలాంటి నవలలని వ్రాసి పాఠకలోకానికి అందిస్తారని ఆశిస్తూ,, ఈ "సంస్కార సమేత రెడ్డి నాయుడు" ధారావాహిక నవల 'ప్రతిలిపి -  సాహిత్య అవార్డు  2021'  తెలుగు విభాగంలో,  మూడో స్థానంలో నిలిచినందుకు రచయితను  అభినందిస్తున్నాను.‌ 

రాధికా ప్రసాద్ 

హైదరాబాదు

 

Varanasi Bhanumurthy Rao is a prolific writer in Telugu.  He penned  down  60 short stories and 600 free prose poems in telugu. He released earlier two  books, Sagara Mathanam in 2000 and Samudra Ghosha in 2005 , both are poetry in Telugu..

 

He released recently '  Mattivedam ' ,  consisting of 70 free prose poems and this novel ' Samskara Sametha Reddy Naidu ' in April 2022.  


  He prefers to  write in Rayala seema dialect as he born and brought up in Rayala Seema. The  story  of  this novel reflecting the  poverty sticken conditions , the problems  and the life style of Rayala  Seema people.  

  

Similarly, this novel "Sanskara Sametha Reddy Naidu" is set on the back drop of  Rayalaseema and tells the story of two aristocratic families in the area. While the story in the novel runs on one side.  the aithor highlights of the area, especially  the rural areas of Chittoor, the author directly mentions the biggest festivals and  related festivities  stage shows  that take place there, and the culture, traditions, in their area. In particular, the author has elaborated on the way in which cultural events take place and how they are celebrated in the villages.


 The author puts a lot of emphasis on the dialect of Chittoor villages  related to this novel. 


Many characters come and go in the storyline. Rayalaseema background, dialect, their lifestyle, appear that  shows  the royalty of the two families. The Chittoor district in particular is notable for its mention of the Bahuda River. The origin of the river, flowing in Rayalaseema and meeting in the sea in Nellore district.




This novel tells about the famine in Rayalaseema over a century ago.  It  was  known as the Dooba famine and the porridge famine  and  at that time people ate jamukayalu, deedara and survived. The author explains that despite the subsequent porridge famine mid 1950s ,   the government at that time fed the people with  porridge and kept them alive. Welfare programs seemed to do nothing beyond that. 




When it comes to the story, the whole story stretches between two villages on either side of the Bahuda River. Although the two families are reciprocal from generation to generation, the events that take place between the children in the third generation provoke animosity between them. The quarrel between the two villages grows like a tornado . Until then, those families and people, who were very close to each other, also developed factions that took the lives of others.  For a while, the people, along with the heads of the two villages, discover an important secret between their two families. The author goes on to tell a quick story about the aftermath, whether there was a reconciliation between them, or how it happened, who caused it, what was the secret between the two families, and why it was hidden. 


After reading Varanasi Bhanumurthy Rao's novel 'Sanskara Sameta Reddy Naidu', his desire to introduce the greatness of his region to the readers became clear. In it he succeeded. After observing the trends of the novel, it is proved that it is a work which has given complete satisfaction to the author. 


We  hope to write more such novels in the future and present them to the readers. Wishing the author with best wishes. 


Nandini Publishers






No comments:

Post a Comment