Sunday, May 16, 2021

వ్యత్యాసం

 వ్యత్యాసం 

-----++++---------


నా కున్నది నాకే

నీ కున్నది  నీకే

నాకున్నది నీకు రాదు


నీకున్నది  నాకు రాదు


నీకున్నదని నా కెందుకు ఏడుపు?

నా కున్నదని నీ కెందుకు ఏడుపు?

తలవ్రాతని మార్చ లేవు

విధి కెదురీత ఈద లేవు


తోడుగా వుండేదే నీ గుండె ధైర్యం

రక్షగా ఉండేదే నీ ఆత్మ విశ్వాసం

కర్తవ్యం నీ ముంది వుంది గదా!

తొలి అడుగు వెయ్యాల్సింది నీవే గదా!


ఎలా వస్తుందోయ్  నీకు ప్రగతి?

వళ్ళు వంచితేనే గదా మారేది నీ గతి!

నీ జీవితానికి   ఏది పరమార్థం? 

పదిమందికీ పాటు పడడమే దానర్థం!

-------++++-----------------------------------

వారణాసి భానుమూర్తి రావు

హైదరాబాదు