శీర్షిక: మూగ బోయిన బడులు
రచన: వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు.
29.12.2020
---------------------------------------------------
స్కూళ్ళన్నీ ఇళ్ళల్లో లాప్ టాప్ లై కూర్చొన్నాయి
పిల్లల చదువులు అంతర్జాల మెక్కి అందల మెక్కాయి
బడిగంటల శభ్ధం మూల పడి సన్నగా మూలుగు తోంది
ఆటపాటలు లేని మైదానాలు బోసి పొయ్యాయి
పిల్లలు లేని బడులు శిధిల మైన సత్రాల్లా ఉన్నాయి
టీచర్లు కన బడని పిల్లల బడి పాఠాలు బరువెక్కాయి
స్నేహితులతో మాటా మంతీ కాకమ్మ కథల్లా మిగిలాయి
పిల్లల్లేక మా టేబుల్ బేంచీలు బోసి పొయ్యాయి
మా బడులు మళ్ళీ మాకు కావాలి..
మా చదువులు తరగతి గదిలోనే సాగాలి
అమ్మ ల్లారా ..నాన్నల్లారా మమ్మల్ని బడికి పంపండి
కరోనాకు భయపడి ఇంట్లో బందీలయ్యాము
కరోనా...మమ్మల్ని బడికి పంపించవూ ప్లీజ్!