ఎదురు చూస్తున్నా ! (Awaiting )
--------------------------------------------
ప్రతి రోజు కవిత్వం రాయాలనుకొన్నా
రాయ లేక పోతున్నాను
ప్రతి ఉదయం అందుకే హృదయ తీరాన
నిలబడి భావ తపస్సు చేస్తున్నా!
అక్షరాల నక్షత్రాల మధ్య
ఒక కవితా జాబిలిని వెతుకుతున్నా!
రాత్రి కల గన్న స్వప్నాలను ఏరుకొని
తోలి పొద్దు తరుముతున్న చీకట్లను వెంబడిస్తున్నా!
ఎందుకో మస్తిష్కం మొద్దు బారి పోయింది
ఎండిపోయిన అక్షరాల బీజాల మధ్య
సాహితి సేద్యాన్ని చెయ్యలేక పోతున్నా!
నిర్వేద ముద్రలో ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్నా!
వాకిటలో ఎదురు చూస్తూ నిలుచున్నా
నా కవితా కన్యాగమనాసక్తుడనై !
వారణాసి భానుమూర్తి రావు
--------------------------------------------
ప్రతి రోజు కవిత్వం రాయాలనుకొన్నా
రాయ లేక పోతున్నాను
ప్రతి ఉదయం అందుకే హృదయ తీరాన
నిలబడి భావ తపస్సు చేస్తున్నా!
అక్షరాల నక్షత్రాల మధ్య
ఒక కవితా జాబిలిని వెతుకుతున్నా!
రాత్రి కల గన్న స్వప్నాలను ఏరుకొని
తోలి పొద్దు తరుముతున్న చీకట్లను వెంబడిస్తున్నా!
ఎందుకో మస్తిష్కం మొద్దు బారి పోయింది
ఎండిపోయిన అక్షరాల బీజాల మధ్య
సాహితి సేద్యాన్ని చెయ్యలేక పోతున్నా!
నిర్వేద ముద్రలో ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్నా!
వాకిటలో ఎదురు చూస్తూ నిలుచున్నా
నా కవితా కన్యాగమనాసక్తుడనై !
వారణాసి భానుమూర్తి రావు