స్వర్గం చేజారి పోయింది !
--------------------------------------
ఏయ్
మిస్టర్
నువ్వు స్వర్గాన్ని చూశావా ?
నీ కళ్ళల్లోంచి జారి పడిందిప్పుడే !
నువ్వు ఏ స్వర్గం కోసం కలలు కన్నావో
అది నీ కళ్ళ ముందే జారి పోయింది
ఇన్నాళ్ళూ స్వప్నాల్ని నంజుకొని తినే వాడివి
ఈ వేళ నిజాల్ని కక్కుతున్నావ్ !
నువ్వు స్వర్గాన్ని చూసావో లేదో ...
చూడాలని వుందో లేదో .. కానీ ఒక స్వర్గం చేజారి పోయింది !
నరకాన్ని మటుకు మహా నగరంలో చూస్తున్నావు
పసి పిల్లల ప్రాణాలు బస్సు చక్రాల క్రింద వదిలినా
రోడ్ల మీద గుడులు , దర్గాలు రాత్రికి రాత్రే మొలుస్తున్నా
నోరు తెరచిన మాన్ హొల్లు మనుషుల్ని మింగినా
బద్ధకం రాయుళ్ళు రోడ్ల మీదనే రొచ్చు రొచ్చు చేస్తున్నా
మనకేం గాదు ...
స్వర్గం సిటీ లల్లోనే ఉంది
మెట్రో రైళ్ళు మన తలకాయల మీద నడుస్తాయి
ఇగ కాస్సేపట్లో ఇసిత్రంగా ప్రజలు ఆకాశం మీద నడుస్తారు
ఇరుకు రోడ్ల మీద నరకానికి బారికేడ్లు సిద్దంగా ఉన్నాయి
కొమ్మలు నరికిన చెట్లు సిమెంటు దిమ్మెల మీద పురుడు పోసు కొంటున్నాయి
వాన చుక్కలు ఇంకుడు గుంతల్లేక తారు రోడ్ల మీద వాగులయ్యాయి
ఎండి పోయిన భూగర్భ కుహరాల్లో స్మశాన వాటిక లున్నాయి
విరామమే లేని రోడ్లు చచ్చిన పాముల్లా పడి ఉన్నాయి
ఈ నగరంలో పీల్చే గాలి విషం అవుతుంది
ఈ నగరంలో త్రాగే నీరు గరళం అవుతుంది
ఈ నగరంలో తినే తిండి పాషాణం అవుతుంది
మార్చురీ లలలో శవాలు కాటిక కాపరి అడ్రస్సు కోసం వెతుకు తున్నాయి
నగరంలో దయ్యాలు పారాడుతూనే ఉంటాయి
ఔటర్ రింగు రోడ్డులో మరణ మృదంగాల ట్యూన్ విన బడుతూనే ఉంటుంది
సిటి లో పచ్చ దనం ప్లాస్టిక్ కొమ్మల్లో విరగ బుస్తోంది
నడిజామున నగరం లో ఆమ్ల తుంపర కురుస్తోంది
పర్యావరణం బాలన్సు తప్పి కుంటి నడక నడుస్తోంది
అభివృద్ది పేరుతో భూమాతకు అబార్షన్లు చేస్తూనే ఉన్నారు
నగరంలో పచ్చ దనం పరారై పోయింది
నగరం గరం గరం లా గరం చాయ్ లా ఉంది
నాకు కావాల్సింది ఈ నగరం గాదు
అంబలి తాగిస్తూ ఎదకు హత్తుకొనే అమ్మ గావాలి
పచ్చ దనం కప్పుకొన్న పల్లె పందిరి గావాలి
పీల్చ డానికి చల్లని గాలి గావాలి
తాగడానికి దోసెడు నీళ్ళు గావాలి
జీవించ డానికి నాకు ఒక్క స్వర్గం కావాలి
బ్రతక డానికి నాకు ఒక్క పల్లె గావాలి !!