నాకు నేనే !
-----------------------------------------------
నాకు నేనే ఆకునై , హరితమై , కొమ్మనై , చెట్టునై
నాకే నేనే కోయిలనై , పాటనై , పల్లవినై , వసంతమై
నాకు నేనే ఏరునై , నదినై , ప్రవాహమై , సముద్రమై
నాకు నేనే ఆకాశమై , నక్షత్రమై , నీలమై , శూన్యమై
నాకు నేనే అనంతమై , ఆదినై , అంతమై , అకాలమై
నా ఉనికి ప్రభంజనమై
నా నడక ప్రస్తానమై
నా నడత సంభ్రతమై
నా కవిత ప్రభాతమై
నాకు నేనే
ప్రభ వించి , అస్తమించి
నాకు నేనే
స్ఖలించి , సంగమించి
నాకు నేనే
జనించి , జ్వలించి
నాకు నేనే
వెలుగునై , చీకటినై
నాకు నేనే
దృశ్యమై , అదృశ్యమై
నాకు నేనే
శి లనై , శిలాజమై
నాకు నేనే
కాలమై , కాలాంతమై
నాకే నేనే
ప్రశ్ననై , జవాబునై .....
భాను వారణాసి / 21.08. 2015