రచయిత గురించి
అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
expression of my thoughts and feelings.
Sunday, August 4, 2024
రచయిత గురించి
Saturday, July 20, 2024
బాల కార్మీకులు
శీర్షిక : బాల కార్మీకులు
*************************************
లేత చెంపలపై కారుతున్న రక్తాశృవులు
పూవులాంటి సుతిమెత్తని చేతులతో
సమాజంలోని కుళ్ళును మోస్తూ సున్నిత
చేతులే రాతి బండలై రక్త మోడుతున్న
ఈ చిన్నారులకు ఎంత కష్టం? ఎంత కష్టం??
ఎండకు వానకూ వాలిపోతూ సడలి పోతూ
కృంగిన హృదయాన్ని రేపటికోసం మోసుకొంటూ
జీవితమంటే అర్థం కాని వయసులో
బ్రతుకుల్ని పెట్టుబడి దారీ వ్యవస్థకు బలి చేసిన
బాల కార్మీకులకు ఎంత కష్టం ? ఎంత కష్టం ?
ఎన్ని చట్టాలున్నా బాల కార్మీకులు శిలువకు
నిలబెట్టిన బాల ఏసులై శ్రమ బానిసలై
బ్రతుకంటే రాళ్ళూ రప్పలు మొయ్యడమేనా?
చిన్నారి బాలల బ్రతుకుల్లో ఛిద్రమైన ఆశలు
మోడుబోయిన పసి వాళ్ళకు ఎంత కష్టం ?
కూలి డబ్బులు అమ్మ అయ్య చేతుల్లో
పెట్టి ఆ రోజు కడుపు నింపుకోవడమే!
భవిష్యత్తు మీద భరోసా లేని అభాగ్యులు
బాల కార్మీకులు లేని సమాజాన్ని చూడాలి!
వారికి మేమున్నామంటూ ప్రభుత్వాలు
చేయూత నివ్వాలి! చేయూత నివ్వాలి!!
**************************************
వారణాసి భానుమూర్తి రావు
18.07.2024
Saturday, March 18, 2023
విశ్వంభరుడు ( the universal man)
విశ్వంభరుడు
-----------
ఈ ప్రపంచంలోకి విసిరి వేయ బడ్డ మనిషివి నువ్వు , ఖాళీ చేతులతో కర్మ సిద్దాంతాన్ని ఒంట పట్టించుకొని బ్రతుకు సూత్రాలను వల్లె వేస్తున్నావు
ఈ ప్రపంచం రెండుగా విభజింప బడింది,
పగలూ వెలుతురులా , రాత్రీ చీకటిలా
ఈ ప్రపంచం ఒక మారథాన్ , నిలకడ లేకుండా పరుగులు పెడుతోంది నిర్విరామంగా, నిరాటంకంగా
చీకటి నిండిన గుహల్లోంచి గాజు పెంకుల ఆర్త నాదాలు
వినిపిస్తునాయి, కొన్ని జాతులు నిర్వీర్యమై పోతున్నాయి , కొన్ని తెర మరుగునే వుండి అంతరించి పోతున్నాయి, కొన్ని శలభాల్లా మంటల్లో పడి మాడి మసై పోతున్నాయి
కొన్ని మట్టి హృదయాలు గట్టి పడి మొద్దు బారి పోయి మొలకలు ఎత్తడం లేదు , ఆ మట్టిలో సుగంధం లేదు , ఆ మట్టి నిర్జీవమై పోయింది , ఆ మట్టికి చిగురించే గుణం పోయింది
ఆకాశం విరిగి మిన్ను మీద పడ్డట్లు ప్రపంచం మొత్తం సెంట్రిఫూగల్ ఫోర్స్ తో పరుగులు పెడుతోంది ,భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని తప్పులు పడుతూ
అక్కడ పెద్ద గెలాక్సీలు , కృష్ణ బిల్వాలు , ఎన్నో వింత క్రొత్త ప్రపంచాలు ఈ విశ్వంలో ఆవృత మవుతున్నాయి , అదొక్క పెద్ద మిస్టరీ !
ఏ కోణం లో చూసినా విశ్వ మానవుడు సందిగ్ధం లో పరుగులు పెడుతున్నాడు శూన్యం లోకి, రోదసీ లోకి , పరిమళించని మట్టి కోసం ! ప్రభవించని ఉదయం కోసం !!
************************************
వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు
21.12.2022
English translation
------------------------------
Vishwambhar ( universal man)
-----------
You are a man who has been thrown into this world, empty-handedly clinging to the theory of karma and throwing out the sutras of life.
This world is divided into two,
Day is light and night is darkness
This world is a marathon, running relentlessly, relentlessly without any hassles
Glass shells echoed through the dark caverns , It is heard that some species are dying out, some are disappearing, some are dying like moths in the fire.
Some hearts of the soil are hard and stiff and the sprouts are not growing, the soil has no fragrance, the soil has become lifeless, the soil has lost its sprouting quality.
The whole world is running with centrifugal force like the sky breaking and falling on lightning, falsifying the theory of gravitation.
There are big galaxies, black holes, and many strange new worlds in this universe, that's a big mystery!
From any point of view, the universal man is running in confusion into the void, into the sea, for the unscented soil! For an uneventful morning!!
**************************************
Varanasi Bhanumurthy Rao
Hyderabad
21.12.2022
Monday, January 16, 2023
సంక్రాంతి పండుగ
సంక్రాంతి పండుగ
---------------
నగర జీవితంలో అపార్టుమెంటుల్లో ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్న మనకు
భోగిమంటలు వేసుకోవడానికి చోటెక్కడిది?
ద్వారాలకు తోరణాలు కట్టడానికి మామిడాకు లెక్కడివి?
పిల్లలకు భోగిపళ్ళు పోయడానికి తీరికెక్కడిది?
పండగ రోజు తలంటు పోసుకొని అభ్యంగన స్నానం చెయ్యడానికి ఓపికెక్కడిది?
బాల్యం గుర్తుకొచ్చి మనసంతా బాధగా ఉంది!
ముగ్గుల్లో గుమ్మడి పూల గొబ్బెమ్మలతో ప్రతి గృహమూ శోభిస్తూ వుండేది
హరిదాసుల , గంగిరెద్దుల ఆట పాటలు గుండె లోతుల్లో ఆనందపు టంచులు చూసేవి
ఇల్లంతా అయిన వాళ్ళ ప్రేమానురాగాలతో అల్లుకొని పొయ్యేది
పిండి వంటల ఘుమ ఘుమలు , అరిటాకుల్లో విందు భోజనాలు , పొంగళ్ళు , పాయసాలు
అరవై ఏళ్ళ జీవితం నగరానికి అంకితమై పోగా బాల్య స్మృతులు మిగిలి పొయ్యాయి
అపార్టుమెంటు గదిలో అతుక్కొని పోయిన బ్రతుకు
ఒంటి స్థంభం మేడలో పరీక్షత్తు మహరాజు బ్రతుకులా మిగిలి పోయింది
అమెరికాలో ఆ మూల సౌధంబులో కొడుకు, కోడలు అల్లుడు ,కూతురు ,పిల్లలు
వీడియో కాల్ లో సంక్రాంతి శుభాకాంక్షల పలకరింపులు
గంగిరెద్దుల విన్యాసాలకు , హరిదాసు కీర్తనలకు శిల్పారామం వుందిగా!
పిండి వంటల విందు భోజనాలకు స్విగ్గీ లో ఆర్డరు
కృత్తిమ జీవితంలో కృత్తిమ ఆనందాలు , కల్తీ భాంధవ్యాలు , మమతల మరీచకలు
సంక్రాంతి పండక్కి ఎక్కడుంది క్రాంతి?
పండక్కి అందరూ కలవాలనేది ఒక భ్రాంతి !
సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే సంక్రాంతి!
అయిన వాళ్ళందరూ ఒక చోట కలిస్తేనే పండగ కాంతి!
_____________________________________
వారణాసి భానుమూర్తి రావు
14.01.2023
Tuesday, January 10, 2023
నేను చెట్టుగా పుడతాను
నేను చెట్టుగా పుడతాను
~~~~~ ~~~~~~~~~~
ఇక మనం అణు బాంబులా విచ్చన్నమై పోవాల్సిందే!
ఇక మనం సునామీలా విరుచుకు పడాల్సిందే!
సింహంలా జూలు విదిల్చి పులిలా గాండ్రించాల్సిందే!
కొవ్వెక్కిన మృగాళ్ళ అరాచకాలకు బలి అయిన అబలలు రాక్షస సంహారం చెయ్యాల్సిందే!
అభం శుభం తెలియని పసి పిల్లల్ని చిదిమేస్తున్న నర హంతకుల భరతం పట్టాల్సిందే!
నవ మాసాలు మోసి పెంచిన తల్లిని చంపుకొన్న కిరాతకుడి చేతులు కాళ్ళు తెగ్గొట్టాల్సిందే!
ఆఫీసుల్లో అమ్మాయిల్ని కామ కేళీ వస్తువులుగా వాడుకొంటున్న మర్యాద మదన కామ రాజుల్ని ఇరగ దీయాల్సిందే!
బలవంతపు మత మార్పిడి చేస్తూ పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్న మత పిశాచులను సిలువ వెయ్యాల్సిందే!
వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తూ వావి వరుసలు మరచి చెలరేగే గార్దభాల్ని నట్టేట ముంచాల్సిందే!
ప్రజ్వరిల్లిన ప్రచండ భయంకర అక్షరాలు కత్తులై , చుర కత్తులై నరాధముల కుత్తుకలు కత్తరించాల్సిందే!
ఎదురేగుతున్నాను నేను సముద్రాల దిగంతాలకు , ఎగజిమ్ముతున్న లావాల పర్వతాల శిఖరాలకు
నన్ను నేను ఆహుతి చేసుకొని బూడిదగా తిరిగి ఈ మట్టిలో మళ్ళీ వాలుతాను
అప్పుడయినా ప్రక్షాళన చేసుకొన్న సమాజాన్ని చూడడానికి ఒక చెట్టుగా పుడతాను.
వారణాసి భానుమూర్తి రావు
06.01.2023
---------------------------------------------------------
Thursday, December 22, 2022
మా బడి
మా బడి
--------
నే నెరిగిన మా బడి
నా మదిలో చెరగిన ముద్ర వేసింది
మా బడిలో
తెలుగు తనం విరగ బూచేది
మా గురువుల ఆదర్శం
పిల్లల బ్రతుకు బాటను నడిపించేవి
కుల మత బేధాలు
ధనిక పేద భావాలు
మాకు తెలిసేవి కావు.
మా బడి గంట మా ఎదల్లో ఈ నాటికీ
ధ్వనిస్తున్న డమరుక ధ్వని
ప్రార్థన తో మొదలయ్యే మా పాఠశాల
డ్రిల్లు క్లాసుతో ముగుస్తుంది
అనురాగాల అమ్మ ఒడి మా బడి
గోదారిలా వురకలు బెట్టేది మా తరగతి గది
అప్పట్లో ఆడుకొన్న ఆటలు , పాడుకొన్న పాటలు
మది నుండి నిష్క్రమణ గాని అమర జ్ణాపకాలు
అయ్యవారి బెత్తంతో తిన్న దెబ్బలు
అవి మరచి పోలేని గుణ పాఠాలు
మేము పాడే మా బడి గీతం
మమ్మల్ని నడిపించే మా జీవన గీతం
అందుకే మా బడి
మా అమ్మ ఒడి.
రచన: వారణాసి భానుమూర్తి రావు
హైదరాబాదు
Monday, December 12, 2022
పాపం మా అమ్మా నాన్న!
పాపం మా అమ్మా నాన్న!
--------------------
నా చిన్నతనం లో మా అమ్మా నాన్నలే నా లోకం
వారిని ఒక్క క్షణం చూడందే వుండ లేక పొయ్యే వాడిని
నేను కాలేజీ హాస్టల్లో చదువు కొంటున్నప్పుడు
అమ్మా నాన్నల్ని అప్పుడప్పుడు సెలవుల్లో చూస్తూ వుండే వాడిని
నాకు పెళ్ళయిన తరువాత నా శ్రీమతే నాకు
సర్వస్వం అయి పోయింది
నాకు పిల్లలు పుట్టిన తరువాత వారే
నా లోకం అయిపోయింది
నాకు జన్మ నిచ్చిన అమ్మానాన్నలను అసలు చూడడానికి , పలకరించడానికి కుదరడం లేదు
ఎందుకంటే మా అమ్మా నాన్నలని వృద్ధాశ్రమం లో చేర్పించింది నేనే గదా!
వారణాసి భానుమూర్తి రావు
02.12.2022