Saturday, July 20, 2024

బాల కార్మీకులు



శీర్షిక : బాల కార్మీకులు

*************************************

లేత చెంపలపై కారుతున్న రక్తాశృవులు

పూవులాంటి సుతిమెత్తని చేతులతో

సమాజం‌లోని కుళ్ళును మోస్తూ సున్నిత 

చేతులే రాతి‌ బండలై‌ రక్త  మోడుతున్న

ఈ చిన్నారులకు ఎంత కష్టం? ఎంత కష్టం??


ఎండకు వానకూ  వాలిపోతూ సడలి‌ పోతూ 

కృంగిన హృదయాన్ని రేపటికోసం మోసుకొంటూ 

జీవితమంటే అర్థం కాని వయసులో 

బ్రతుకుల్ని‌  పెట్టుబడి దారీ వ్యవస్థకు బలి చేసిన

బాల కార్మీకులకు ఎంత కష్టం ? ఎంత కష్టం ?


ఎన్ని చట్టాలున్నా బాల కార్మీకులు శిలువకు 

నిలబెట్టిన బాల ఏసులై శ్రమ బానిసలై 

బ్రతుకంటే రాళ్ళూ రప్పలు మొయ్యడమేనా?

చిన్నారి బాలల బ్రతుకుల్లో ఛిద్రమైన ఆశలు‌

మోడుబోయిన పసి వాళ్ళకు ఎంత కష్టం ? 


కూలి డబ్బులు అమ్మ అయ్య చేతుల్లో 

పెట్టి ఆ రోజు కడుపు నింపుకోవడమే!

భవిష్యత్తు మీద భరోసా లేని అభాగ్యులు 

బాల కార్మీకులు లేని సమాజాన్ని చూడాలి‌! 

వారికి మేమున్నామంటూ ప్రభుత్వాలు 

చేయూత నివ్వాలి! చేయూత నివ్వాలి!!

**************************************


వారణాసి భానుమూర్తి రావు

18.07.2024


No comments:

Post a Comment