ఆయప్ప మంచోడు కాదు
---------------------------------------------
ఆయప్ప మంచోడు కాదు
సాయంకాలం కాగానే కన్ను కొట్టి
గడ్డి వాము ఎనక్కి రమ్మంటాడు
బచ్చట్లో తానం సేస్తావుంటే
పిట్ట గోడెక్కి తొంగి తొంగి సూస్తాడు
ఎట్లేకి బొయ్యి గుడ్డ లుతకతా ఉండా
నీల్ల కి తడిసి పోయిన
నా వల్లును సుస్తానే ఉండాడు
ఆడు మంచోడు కాదని సెబితే
ఇనె వాల్లు ఎవరు నా మాట
నేను మడ్లోకి ఎల్లి
పిక్కల దాక సీర ఎగ్గట్టి కట్టి
బురద తోక్కతా ఉంటే
కిందా పైనా నా అయిపే సూస్తాడు
పల్లి కవతల దిగుడు బాయి కెల్లి
మంచి నీల్లు కడవతో నిమ్పుకోనస్తా ఉంటే
ఎవరు లెంది సూసి నా పైట పట్టుకొని లాగుతాడు
నా మానం బోతుంది ఎయరైన సూస్తే
అంటే గూడా బయపన్నే బయపడ్డు
మన యిసయం ఎవరికీ తెలిదులే అంటాడు
సేన్లో మొన్న గోడ్ల మేపతా ఉంటే
నక్కి నక్కి వచ్చి నన్ను వాటేసు కొన్యాడు
మా నాయనకు తెలిస్తే
నిన్ను నన్ను నరికేస్తాడు అని సెప్పినా
అయినా బయ్యం లేదన్యాడు
నేనేక్కడికి బోతే నా ఎనకాలే ఎంట బడతా ఉండాడు
గడ్డి కోసుకోను బయటకేల్లితే
కొడవలి తీసుకొని గడ్డి కోసి నానెత్తిన బెట్టినాడు
దొంగోడు మాదిరొచ్చి నా సంకల్లో సక్కల గిల్లి పెట్న్యాడు
ఒక్క రోజు మా పసుల కోట్నం లో దూరి
ఎద్దులు ఎనుములతో రాత్రంతా
నా కోసం జాగారం సేసి నాడు
మా బండల మిద్దె మిదేక్కి
గవాచ్చం గుండా తొంగి తొంగి సూస్తాడు
కలకడ త్తిర్నాలకు
వస్తావ లేదా అని ఒకటే పోరు
రాను సామి నన్ను ఓది లేయ్యప్పా అంటే ఇన్నే ఇనడు
ఎం సావు రాసి బెట్టిందో ఈ యప్పతో !!
మా నాయనొల్ల దగ్గర సెప్పు దేబ్బలు తినాల్నో ఏమో !!
నా కయితే బలే బయ్యం ఏస్తా ఉండాది .
భాను వారణాసి
3 feb 2015
---------------------------------------------
ఆయప్ప మంచోడు కాదు
సాయంకాలం కాగానే కన్ను కొట్టి
గడ్డి వాము ఎనక్కి రమ్మంటాడు
బచ్చట్లో తానం సేస్తావుంటే
పిట్ట గోడెక్కి తొంగి తొంగి సూస్తాడు
ఎట్లేకి బొయ్యి గుడ్డ లుతకతా ఉండా
నీల్ల కి తడిసి పోయిన
నా వల్లును సుస్తానే ఉండాడు
ఆడు మంచోడు కాదని సెబితే
ఇనె వాల్లు ఎవరు నా మాట
నేను మడ్లోకి ఎల్లి
పిక్కల దాక సీర ఎగ్గట్టి కట్టి
బురద తోక్కతా ఉంటే
కిందా పైనా నా అయిపే సూస్తాడు
పల్లి కవతల దిగుడు బాయి కెల్లి
మంచి నీల్లు కడవతో నిమ్పుకోనస్తా ఉంటే
ఎవరు లెంది సూసి నా పైట పట్టుకొని లాగుతాడు
నా మానం బోతుంది ఎయరైన సూస్తే
అంటే గూడా బయపన్నే బయపడ్డు
మన యిసయం ఎవరికీ తెలిదులే అంటాడు
సేన్లో మొన్న గోడ్ల మేపతా ఉంటే
నక్కి నక్కి వచ్చి నన్ను వాటేసు కొన్యాడు
మా నాయనకు తెలిస్తే
నిన్ను నన్ను నరికేస్తాడు అని సెప్పినా
అయినా బయ్యం లేదన్యాడు
నేనేక్కడికి బోతే నా ఎనకాలే ఎంట బడతా ఉండాడు
గడ్డి కోసుకోను బయటకేల్లితే
కొడవలి తీసుకొని గడ్డి కోసి నానెత్తిన బెట్టినాడు
దొంగోడు మాదిరొచ్చి నా సంకల్లో సక్కల గిల్లి పెట్న్యాడు
ఒక్క రోజు మా పసుల కోట్నం లో దూరి
ఎద్దులు ఎనుములతో రాత్రంతా
నా కోసం జాగారం సేసి నాడు
మా బండల మిద్దె మిదేక్కి
గవాచ్చం గుండా తొంగి తొంగి సూస్తాడు
కలకడ త్తిర్నాలకు
వస్తావ లేదా అని ఒకటే పోరు
రాను సామి నన్ను ఓది లేయ్యప్పా అంటే ఇన్నే ఇనడు
ఎం సావు రాసి బెట్టిందో ఈ యప్పతో !!
మా నాయనొల్ల దగ్గర సెప్పు దేబ్బలు తినాల్నో ఏమో !!
నా కయితే బలే బయ్యం ఏస్తా ఉండాది .
భాను వారణాసి
3 feb 2015
No comments:
Post a Comment