Tuesday, September 11, 2018

బస్సు భూతం


బస్సు భూతం
--------------------++++++-----------------
మొక్కులు చెల్లించి
అంజన్నకి మొక్కి రావాలని
కొండ గట్టు ఎక్కిన బీదా సాదలకు
ఎంత కష్టం ? ఎంత కష్టం?
అక్కడ తుక్కు సామాన్లకు
పనికి రాని సర్కారు  బస్సు
పద్దతి ప్రకారం రోజూ కొండ గట్టు చేరవేసేదే!
బ్రేకులు పడని బస్సుకు
నిజంగా డ్రైవరన్న దేముడే!
అంజన్న కోసం
కొడుకులు -  కోడళ్ళు
అన్నలు -  తమ్ముళ్ళు -అక్కలు‌- చెల్లెళ్ళు
అయ్యలు - అమ్మలు
తిరగ బడిన బస్సు  ప్రాణాలు తీసింది
చావుకు దగ్గరలో బస్సు ముక్క లయింది
పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?
పగిలిన  బొమ్మలు అతుక్కొంటాయా??
సర్కారిచ్చే నగదు పరిహారం
ఎన్ని‌ ప్రాణాల్ని తిరిగి తెస్తుంది?
బ్రతుకులు బుగ్గి అయినాక
ఎన్ని సుద్దులు చెప్పితే లాభం ఏమి?
నిన్నటి పచ్చని  బ్రతుకులు
నేడు ఖతం అయినాక
ఎవర్ని అడగాలి?
ఇది ప్రభుత్వ వైఫల్యమా?
ఇది విధి  పెట్టిన శాపమా?
ప్రాణాలు పోగొట్టుకున్న అమాయకులకు
మళ్ళీ ప్రాణం తిరిగొస్తుందా??
( కొండగట్టు లో ఈ రోజు జరిగిన బస్సు ప్రమాదంలో 40 మంది మరణించారని వార్త విన్నప్పుడు ఆవేదనతో రాసిన కవిత)
భాను వారణాసి
11.09.2018.


No comments:

Post a Comment