Monday, June 19, 2017

బ్లాక్ బాక్స్ (BLACK BOX )

బ్లాక్ బాక్స్  (Black  Box  )






అందంగా ఉన్నప్పుడు
ఆమె అంతెత్తుకు ఎగిరింది
యవ్వనంలో మేఘాల మీద
మయూరిలా నర్తించింది
జీవితమే ' రన్ వే ' ఆమెకు
టేక్ ఆఫ్ లు. . లాండింగ్ లు ..
షికార్లు .. సరదాలు ..
ప్రపంచాన్ని చుట్టేసింది
ఆకలి గొన్న కొన్ని సింహాలు
ఆమె ' కాక్ పిట్ ' లోకి ప్రవేశించాయి
కొన్ని నిరర్థక పక్షులు
ఆమెను ఢీ కొన్నాయి
రెక్కలు తెగిన విమానంలా
ఆమె కూలి పోయింది
శకలాలు ముక్కలయిన
మెటెరోయిడ్స్ లా జారి పడ్డాయి
ఇప్పుడందరూ బ్లాక్ బాక్స్ కోసం
వెతుకు తున్నారు
పగిలి పోయిన గొంతు పలికిన
చివరి సత్యాలు ఏవైనా
నిక్షిప్తమై ఉన్నాయా అని !!
(పేపర్లో శిరీష ఉదంతం చదివాక )

Bhanu Varanasi /  20.06.2017/ USA 

1 comment:

  1. బాబోయ్,శిరీష భాధను గురించి ప్లైన్ లాగా ఎక్సప్లైన్ చేస్తున్నారు కదండీ.నిజంగా ఏమాట కామాటే శిరీష విషయం మాత్రం చాలా భాదగా అనిపించిందిఅంది.మీరు మాత్రం దానిని మనసులోంచి బయటకు లాకొచ్చారు.ఎనీ వే మీతో నేను ఏకీకరిస్తున్నాను.

    అలాగే నా గురించి,

    నా పేరు ch .అజయ్ కుమార్,మాది కృష్ణ జిల్లా విజయవాడ, నాకొక ఇంటర్నెట్&వెబ్ టెక్నాలజీస్ బ్లాగ్ ఉంది. దాని పేరు AP WEB ACADEMY .ఈ బ్లాగ్ లో నేను ముఖ్యంగా వెబ్ సైట్స్,బ్లాగ్స్ బిల్డ్ చేయటం, వాటిని మైంటైన్ చేయటం మరియు ప్రోగ్రామింగ్ లాంగ్వాజెస్ ఐన HTML CSS జావాస్క్రిప్ట్,మై SQL ,PHP మొదలైన వాటి గురించి ,మరియు హాకింగ్ గురించి,కంప్యూటర్ మొబైల్ టిప్స్ గురించి ఆర్టికల్స్ ప్రెజెంట్ చేస్తాను.దయ చేసి నా బ్లాగ్ ని విజిట్ చేసి మీ విలువైన సలహాలు తెలియ చేయగలరు.

    నా వెబ్సైటు అడ్రస్:- HTTPS://apwebacademy.com

    థాంక్ యు సో మచ్

    ReplyDelete